Pawan Kalyan: హిస్టరీ రిపీట్.. ఉస్తాద్ భగత్ సింగ్ లెక్కల్లో చుక్కలు!
గబ్బర్ సింగ్‌కి, ఉస్తాద్ భగత్ సింగ్‌కి పోలికలు పెడుతున్నారు కొందరు ఫ్యాన్స్. రెండు సినిమాల్లోనూ హీరో పోలీసే.. కాకపోతే అక్కడ గబ్బర్ సింగ్ విలన్, ఇక్కడ భగత్ సింగ్ హీరో. ప్రతీ పకోడిగాడు హీరో అనుకుంటుంటే, తనని తాను విలన్ అనుకోవటమే బెటర్ అంటూ అప్పట్లో గబ్బర్ సింగ్‌లో మాటల తూటా పేల్చాడు పవన్.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ తీస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. గ్లింప్స్ వచ్చింది. పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే రేంజ్‌లో వీడియో వండర్స్ చేస్తోంది. ట్రెండ్ సెట్ చేసే టైం మళ్లీ కనిపిస్తోంది. ఇక గబ్బర్ సింగ్‌కి, ఉస్తాద్ భగత్ సింగ్‌కి పోలికలు పెడుతున్నారు కొందరు ఫ్యాన్స్. రెండు సినిమాల్లోనూ హీరో పోలీసే.. కాకపోతే అక్కడ గబ్బర్ సింగ్ విలన్, ఇక్కడ భగత్ సింగ్ హీరో.
ప్రతీ పకోడిగాడు హీరో అనుకుంటుంటే, తనని తాను విలన్ అనుకోవటమే బెటర్ అంటూ అప్పట్లో గబ్బర్ సింగ్‌లో మాటల తూటా పేల్చాడు పవన్. ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్‌లో కూడా అదే జోరు, అదే హోరు. కాని ఎమోషన్ ఛేంజ్. తమిళ తేరీ తెలుగు రీమేకే ఉస్తాద్ భగత్ సింగ్. గతంలో దబాంగ్‌ని తెలుగులో గబ్బర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి ట్రెండ్ సెట్ చేశాడు హరీష్ శంకర్. బేసిగ్గానే తనో పవన్ ఫ్యాన్. అందుకు తగ్గట్టే పవర్ స్టార్‌ని పవర్ ఫుల్ రోల్‌లో చూపించాడు. కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ అన్నీ కలగలిపి హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఉస్తాద్ గబ్బర్ సింగ్‌తో కూడా అదే హిస్టరీ రిపీట్ అయ్యేలా ఉంది.