Pawan : ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్సయినట్లేనా…
'గబ్బర్ సింగ్' (Gabbar Singh) వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) - హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో వస్తున్న హైఓల్టేజీ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustad Bhagat Singh). ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Ustad Bhagat Singh's OTT partner is fixed...
‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) – హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో వస్తున్న హైఓల్టేజీ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh). ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్ష్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా హరీశ్ శంకర్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. దీనికితోడు ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ హైప్‌ను మరింతగా పెంచేశాయి. ఈ మూవీ అప్‌డేట్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెర దించుతూ.. ఓ సూపర్ ట్రీట్ ని మేకర్స్ నిన్ననే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసారు. దీంతో.. ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ గురించి వినిపిస్తోన్న ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీకి ఓటిటి పార్ట్నర్ లాక్ అయినట్లు ఓ లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. మేకర్స్ ఈ సినిమా ప్రోమో ఒకటి అమెజాన్ ప్రొడ్యూసర్స్ మీట్ లో ప్లే చేయనున్నారని ఫిలిం వర్గాల్లో న్యూస్ వినిపిస్తోంది. దీనిని బట్టి ఉస్తాద్ భగత్ సింగ్ హక్కులు దాదాపుగా ప్రైమ్ వీడియోకే వెళ్లడం దాదాపు కన్‌ఫామ్ అయినట్లే అంటున్నారు. ఇక దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉన్నప్పటికీ.. ప్రజెంట్ ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత ఏడాదిలోనే మొదలు పెట్టారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను జరిపారు. అలాగే మిగిలిన షెడ్యూళ్లను కూడా పక్కా ప్లాన్‌తో చేసుకుంటూ వెళ్లాలని అనుకున్నారు. కానీ, పవన్ కల్యాణ్ డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడంతో ఇది ఆగిపోయింది. ఎన్నికల తర్వాత ఈ మూవీ షూట్ స్పీడందుకోబోతుందంటున్నారు. కాగా.. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ‘తేరీ’ మూవీకి రీమేక్‌గా రూపొందుతున్న ఈ మూవీని పవర్ స్టార్ రేంజ్‌కు తగ్గట్లుగా పవర్‌ఫుల్ ఛేంజెస్ చేస్తున్నాడట హరీశ్ శంకర్.. చూడాలి మరి.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పవన్ ఫ్యాన్స్‌కు ఎలాంటి ట్రీట్‌ను ఇవ్వబోతోందో..