Rashmika : రష్మిక వీడియో పై అమితాబ్ ఆగ్రహం..!
మామూలుగా హీరోయిన్లపై మార్ఫింగ్ వీడియోలు కొత్తేం కాదు. చాలా కాలంగా వివిధ టెక్నాలజీతో ఫేస్.. బాడీ మార్పింగ్ లు జరుగుతున్నాయి. అయితే అవి ఫేక్ వీడియోలు అని పట్టి పట్టి చూస్తే తెలిసిపోతుంది. కానీ ఏఐ టెక్నాలజీతో వస్తోన్న మార్పింగ్ వీడియోల్సి పట్టుకోవడం మాత్రం అంత సులభం కాదు.
శ్రీవల్లి మార్ఫింగ్ వీడియో..!
టెక్నాలజీ (Technology) ని మంచి కోసం వాడితే మంచి ఫలితాలొస్తాయి. అదే టెక్నాలజీని చెడుకోసం వాడితే.. దానిని పరిణామాలను ఊహించుకుంటేనే భయం వేస్తోంది. రీసెంట్ గా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్ టెక్నాలజీ ఇంటర్నెట్ ని ఓ రేంజ్ లో షేక్ చేస్తుంది. ముఖ్యంగా సెలబ్రిటీలపై ఏఐ టెక్నాలజీతో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో మంచి పక్కన బెడితే..చెడు ఎలా ఉంటుందో రష్మిక మందన్నా మార్పింగ్ వీడియో చూస్తే తెలుస్తోంది.
మామూలుగా హీరోయిన్లపై మార్ఫింగ్ వీడియోలు కొత్తేం కాదు. చాలా కాలంగా వివిధ టెక్నాలజీతో ఫేస్.. బాడీ మార్పింగ్ లు జరుగుతున్నాయి. అయితే అవి ఫేక్ వీడియోలు అని పట్టి పట్టి చూస్తే తెలిసిపోతుంది. కానీ ఏఐ టెక్నాలజీతో వస్తోన్న మార్పింగ్ వీడియోల్సి పట్టుకోవడం మాత్రం అంత సులభం కాదు. ఒరిజినల్ ఫేస్ లకు.. బాడీలకు పక్కాగా మ్యాచ్ అవుతోంది ఏఐ వీడియో. అదే ఇప్పుడు సెలబ్రిటీలక శాపంగా మారింది. ఇటీవలే రష్మిక మందన్న (Rashmika) రూపంతో ఉన్న ఓ మార్ఫింగ్ వీడియో ( morphing videos) సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దానిపై బిగ్ బీ అమితాబ్ (Amitabh’s) బచ్చన్ సిరీయస్ అయ్యాడు. తనదైన స్టైల్ లో చురకలంటించారు. అలాంటి చెత్త వీడియోలు చేసే వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని అన్నారు.
రష్మిక ఫేక్ వీడియో విషయానికి వస్తే… అచ్చం రష్మిక మందన్నలా ఉన్న ఓ యువతి లిఫ్ట్‌లోకి వస్తుంది. లోపల ఉన్న వాళ్లను చూసి నవ్వుతుంది. కానీ అందులో ఉన్నది రష్మిక కాదని తెలుస్తోంది. ఈ విషయాన్నే..అభిషేక్ అనే ఓ ట్విటర్ ఖాతాధారుడు రష్మిక ఫేక్ వీడియోకు సంబంధించిన ఒరిజినల్ వీడియోను తన ఖాతాలో షేర్ చేశాడు. ఆ ట్వీట్‌లో ఆమె ఎవరో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోలో ఉన్న ఆమె పేరు జారా పాటెల్. బ్రిటీష్-ఇండియన్ యువతి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు నాలుగు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఈ వీడియోను అక్టోబర్ 9వ తేదీన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.