UV Creations: ఫ్లాప్ హీరోలతో యూవీ క్రియేషన్స్ రిస్క్..

సుమారు 10 ఏళ్ళ క్రితం మొదలైన ఈ సంస్థ అనేక సినిమాలు నిర్మించింది. మిర్చి, మహానుభావుడు, భలే భలే మగాడివోయ్, ఎక్స్‌ప్రెస్‌ రాజా, భాగమతి లాంటి అద్భుతమైన సినిమాలను అందించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 18, 2023 | 04:46 PMLast Updated on: Nov 18, 2023 | 4:46 PM

Uv Creations Taking Risk With High Budget Movies With Flop Heroes

UV Creations: ఆల్రెడీ భారీ నష్టాల్లో ఉన్న సంస్థ అది. కానీ ఊహించని రిస్క్ చేస్తోంది. ఇప్పటికే చేతులు కాల్చుకున్నప్పటికీ.. అవేమీ పట్టించుకోకుండా పెద్ద ప్లానే వేస్తోంది. అసలు ఆ సంస్థ ధైర్యం ఏమిటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థగా కొనసాగుతున్న కంపెనీ యువీ క్రియేషన్స్‌.

Salaar: సలార్ కష్టాలు.. ఒక్కోసారి క్రేజ్ కూడా శాపమే..

సుమారు 10 ఏళ్ళ క్రితం మొదలైన ఈ సంస్థ అనేక సినిమాలు నిర్మించింది. మిర్చి, మహానుభావుడు, భలే భలే మగాడివోయ్, ఎక్స్‌ప్రెస్‌ రాజా, భాగమతి లాంటి అద్భుతమైన సినిమాలను అందించింది. అయితే ఈమధ్య కాలంలో ఫ్లాపులతో సతమతం అవుతోంది. ఇటీవల ఈ బ్యానర్ నుంచి వచ్చిన ఆదిపురుష్‌ ఘోరంగా ప్లాఫ్ కావడంతో భారీ నష్టాలు మూటగట్టుకుంది . అయితే ఇంతక్లిష్ట సమయంలోనూ రిస్క్ చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. అది కూడా ఇద్దరు ప్లాప్ హీరోలతో భారీ సినిమాలకు సిద్దం అవుతోంది‌‌. మెగాస్టార్ తో యూవీ సంస్థ ఓ సినిమా నిర్మిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు అని తెలుస్తోంది.

ఇక అఖిల్ తో కూడా మరో సినిమా ప్లానింగ్ లో ఉంది. అనీల్ కుమార్ దర్శకత్వంలో చేసే ఈ సినిమా కూడా హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందబోతోంది. ఆది పురుష్ తర్వాత యూవీ సంస్థ అప్పుల పాలు అయిందని.. ఇబ్బందుల్లో ఉందని ప్రచారం జరిగింది. అలాంటి ప్రచారాలను తలదన్నుతూ..అత్యధిక బడ్జెట్‌తో మూవీస్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.