Vaishnavi Chaitanya: నిర్మాతల్ని భయపెడుతున్న బేబి హీరోయిన్..!
బేబీ బ్యానర్‌కే రెండు మూవీలు కమిటైన తను, పాత రెమ్యునరేషన్ ప్రకారమే ఆ సినిమాలు చేయాల్సి వస్తోంది. కాబట్టి ఇక మీద ఏమైనా సంపాదించుకోవాలి అంటే కొత్త సినిమాలతోనే సాధ్యం. అందుకే బేబీ తర్వాత చేస్తున్న రెండు మూవీలను వదిలేస్తే, ఆ తర్వాత కమిటయ్యే ప్రతీ మూవీకి రెండు కోట్లు డిమాండ్ చేస్తోంది.

Vaishnavi Chaitanya: బేబీ మూవీతో ఒక్కసారిగా వెండితెరమీద వెలిగిన తార వైష్ణవి చైతన్య. ఇప్పుడు వరుసగా ఆఫర్లైతే పట్టుకుంటోంది. కాని తన రెమ్యునరేషన్ విషయం మాత్రం నిర్మాతల్ని పరేషాన్ చేస్తోందట. రూ.కోటీ.. కోటిన్నర కాదు ఏకంగా రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోందట వైష్ణవి. బేబీ బ్యానర్‌కే రెండు మూవీలు కమిటైన తను, పాత రెమ్యునరేషన్ ప్రకారమే ఆ సినిమాలు చేయాల్సి వస్తోంది. కాబట్టి ఇక మీద ఏమైనా సంపాదించుకోవాలి అంటే కొత్త సినిమాలతోనే సాధ్యం.
అందుకే బేబీ తర్వాత చేస్తున్న రెండు మూవీలను వదిలేస్తే, ఆ తర్వాత కమిటయ్యే ప్రతీ మూవీకి రెండు కోట్లు డిమాండ్ చేస్తోంది. టాలీవుడ్‌లో ఇప్పుడు మహేశ్, పవన్ కళ్యాణ్, నితిన్, రామ్‌తో సినిమాలు చేస్తూ, అన్ని తరాలను కవర్ చేస్తోన్న శ్రీలీల తర్వాత ప్లేస్ తనదే అంటూ వైష్ణవి చైతన్య కామెంట్ చేయటం, కాబట్టి ఆరేంజ్‌లో రూ.4 కోట్లు కాకున్నా అందులో సగమైనా తనకి ఇవ్వాలని డిమాండ్ చేస్తుండటం మీద గుసగుసలు పెరిగాయి. వైష్ణవి చైతన్య మంచి నటిగానే కాదు, గ్లామరస్ రోల్స్ కూడా చేస్తుందని మొదటి మూవీతోనే ప్రూవ్ అయ్యింది. అందుకే సిద్దూ జొన్నలగడ్డ నుంచి శర్వానంద్ వరకు తననే చాలా మంది హీరోలు రెఫర్ చేస్తున్నారట. అచ్చ తెలుగు అందం, అందులో తెలుగులో మాట్లాడే నైపుణ్యం ఈ రెండు లక్షణాలు కొన్ని లోకల్ మూవీలకు చాలా అవసరం.
అందుకే ఊరి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే మూవీలన్నీంటికి వైష్ణవి చైతన్యనే కావాలంటున్నారని, ఆ డిమాండ్‌నే తను కోట్లతో కమాండ్ చేయాలనకుంటోందని ప్రచారం జరుగుతోంది. మంచి భవష్యత్తు ఉన్న నటినే అయినా ఒక్కసారిగా రెండు కోట్లకు తన పారితోషికం ఎగబాకటం అంటే నిర్మాతలకు కష్టమే అనే మాటే వినిపిస్తోంది. ఇది లాంగ్ రన్‌లో హీరోయిన్‌కే ఇబ్బంది పెట్టే వ్యవహారంగా మారే ఛాన్స్ ఉంది.