vaishnavi Chaitanya: బిగ్ బాస్ కి వైష్ణవి చైతన్య షాక్..

బేబీ' సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ వైష్ణవి చైతన్య.. ఒక్క సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 6, 2023 | 03:26 PMLast Updated on: Sep 01, 2023 | 12:30 PM

Vaishnavi Chaitanya Gave A Shock To The Bigg Boss Show

తొలి చిత్రంతోనే కుర్రాళ్ళ హాట్ ఫేవరేట్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రని అద్భుతంగా పండించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు వైష్ణవి. ఓవైపు డీగ్లామర్ గా కనిపిస్తూనే, మరోవైపు గ్లామరస్ గా అదరగొట్టింది. ఈ మూవీ రిలీజై దాదాపు నెలకు వస్తున్న ఇంకా బేబీ మేనియ కొనసాగుతున్న టైమ్ లో బ్యూటీ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్చల్ చేస్తుంది. ఓవైపు పెట్టు బ్యాక్ సినిమా ఆఫర్లు వస్తుండడంతో బిగ్ బాస్ రియాల్టీ షో కిషాకిచ్చినట్టు టాక్ వినిపిస్తుంది.

బిగ్ బాస్ రియాల్టీ షో ఇప్పుడు మొదలైన బుల్లితెరపై దుమ్మురేపుతోంది.కొత్త కొత్త ట్విస్ట్‌లు, ఎమోషన్స్, కామెడీ, ఆట పాటలు, ఎత్తులకు పై ఎత్తులు వేసే టాస్కులు.. కలగలిపిన ఈ షోను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆడియన్స్. అలాంటి రియాల్టీ షో మళ్లీ ముస్తాబయి వచ్చేస్తుంది. ఒక్కో సీజన్‌కు క్రేజ్‌ను పెంచుకుంటూ పోతున్న ఈ షోలోకి ఎవరు పార్టిసిపెంట్స్‌గా వెళ్తారు అనేది ఎప్పుడూ జనాల్లో ఇంట్రస్ట్ ఉండే టాపిక్కే. ఫస్ట్ సీజన్ నుండి రాబోయే సీజన్ వరకు అనేక మంది బిగ్ బాస్‌కు ఊహించని వ్యక్తులు వచ్చారు. అయితే త్వరలో ప్రారంభం కానున్న సీజన్ సెవెన్ లోకి ఎవరోస్తారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే ప్రజంట్ కొన్ని పేర్లు ప్రచారంలో ఉండగానే వైష్ణవి బిగ్ బాస్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది.

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య వస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. బేబీ సినిమా రిలీజ్ కంటే ముందు బిగ్ బాస్ నిర్వాహకులతో అగ్రిమెంట్ కూడా చేసుకుందట. వైష్ణవి కోసం భారీ రెమ్యూనరేషన్ కూడా ఇచ్చేందుకు రెడీ అయ్యారట. అయితే బేబీ రిజల్ట్ తర్వాత షోలో పాల్గొనేందుకు ససేమిరా అంటుందట. ఇందుకు కారణం ఋ్యాటీకి వస్తున్న వరుస ఆఫర్లేనని తెలుస్తోంది. సినిమాలకు కమిట్ అవ్వడం వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేక షోకు నో చెప్పిందట.బిగ్ బాస్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చినప్పటికీ షోలో పాల్గొనేందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదన్న న్యూస్ బుల్లితెరపై సెన్సేషన్ అవుతోంది. మరి ఇందులో నిజాలు ఏంటో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.