Vaishnavi Chaitanya: పంట పండింది.. బేబీ బ్యూటీ కోటి దాటేసిందిగా..!
తన మొదటి చిత్రంలోనే రిస్క్‌తో కూడిన క్యారెక్టర్‌కి 100 శాతం న్యాయం చేయడంతో సినిమా ఛాన్స్ వరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి దాదాపు కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Unfortunately, Vaishnavi Chaitanya is looking down on the opportunity of the baby heroine or the vacant Vaishnavi is another chance.
Vaishnavi Chaitanya: సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల సత్తా చూపించింది వైష్ణవి చైతన్య. ముందుగా యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఈ తెలుగు అమ్మాయి. తరువాత సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. తన నటనతో, తన అందంతో ఆడియెన్స్‌ను ఫిదా చేయడంతో బ్యూటీ క్రేజ్ ఆకాశాన్ని టచ్ చేస్తోంది. ఇప్పుడు అదే క్రేజ్‌తో వరుస అవకాశాలను అందుకుంటోంది బ్యూటీ.
Prabhas: ఇంద్ర భవనంలాంటి ఇల్లు.. ప్రభాస్ కొత్త ఇంటి నిర్మాణం ఖరీదు అన్ని కోట్లా..!
ఈ క్రమంలోనే.. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా వైష్ణవితో ఓ సినిమా ఫిక్స్ చేశారనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. నూతన దర్శకుడు అరుణ్ భీమవరపు డైరెక్షన్‌లో ప్రారంభం కానున్న సినిమాలో హీరోయిన్‌గా వైష్ణవి చైతన్యను సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. తన మొదటి చిత్రంలోనే రిస్క్‌తో కూడిన క్యారెక్టర్‌కి 100 శాతం న్యాయం చేయడంతో సినిమా ఛాన్స్ వరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి దాదాపు కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడున్న హీరోయిన్స్‌కి దీటుగా.. ఓ తెలుగు అమ్మాయి ఇంత మొత్తంలో పారితోషికం అందుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక.. బేబీ మూవీ హిట్ కావడంతో తనకు వరుస ఆఫర్స్ వచ్చినా కూడా.. సెలెక్టివ్‌గా ముందుకి వెళ్తోంది వైష్ణవి చైతన్య.
ఆనంద్ దేవరకొండతో వైష్ణవి ఇప్పటికే మరో చిత్రానికి ఓకే చెప్పింది. ఇదే కాకుండా.. మరో 2 సినిమాలకి కూడా కమిట్ అయ్యి ఉన్నట్టు తెలుస్తోంది. ఇవి.. కాకుండా దిల్ రాజు మూవీ ఎలాగో ఉండనే ఉంది. ఇప్పటికే ఇంత భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న ఈ తెలుగు అమ్మాయి.. ఇంకొన్ని విజయాలు అందుకుంటే స్టార్ బ్యూటీస్ సరసన చేరిపోవడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.