Pawan Kalyan: పవన్‌తో స్టెప్పులేయబోతున్న వాల్తేరు బ్యూటీ..
సాయి ధరమ్ తేజ్, పవన్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న మచ్ అవేటెడ్ మూవీ బ్రో. రీసెంట్‌గానే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. బ్రో అనే టైటిల్ సాంగ్‌తో పవన్ లుక్‌ను రివీల్ చేశారు.

Pawan Kalyan Sai Daram Tej Special Movie
జస్ట్ ఫస్ట్ లుక్ ఇంత గ్రాండ్‌గా ఉంటే ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందనని ఆడియన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్‌ను ఊర్వశి రౌతాలతో చేయించబోతున్నారట. ఈ పాటలో ఊర్వశి పవన్‌తో కలిసి స్టెప్పులేయబోతోందట. ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్‌తో స్టెప్పులేసింది ఊర్వశి.
ఇప్పుడు పవన్‌తో కలిసి డాన్స్ చేయబోతోంది. దీంతో ఈ సాంగ్ కోసం ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. నార్మల్‌గానే సాయి ధరమ్ తేజ్ అన్ని సినిమాల కంటే ఈ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఆడియన్స్‌కు ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో మామ అల్లుడు ఇద్దరు కలిసి నటించబోతున్నారు. స్క్రీన్ మీదే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లో కూడా సాయి ధరమ్ తేజ్‌కు పవన్ కళ్యాణ్‌కు మంచి అనుబంధం ఉంటుంది. తన మామ అంటే తనకు ఎంత ఇష్టమో సాయి ధరమ్ చాలా సార్లు చెప్పాడు.
ఇప్పుడు వీళ్లిద్దరూ ఒకే స్క్రీన్ మీద కనిపించబోతుండటంతో ఇద్దరి ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీలౌతున్నారు. ఇప్పుడు ఐటం సాంగ్ అప్‌డేట్ కూడా రావడంతో ఫ్యాన్స్‌లో మరింత జోష్ వచ్చింది. ఈ సాంగ్ థియేటర్‌లో వస్తే ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.