Srileela : వామ్మో శ్రీలీల గంటకు అంత తీసుకుంటుందా..

ధమాకా తర్వాత ఫుల్ బిజీగా మారిపోయిన శ్రీలీల.. వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవట్లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత బిజీ హీరోయిన్ గా మారిపోయింది. వరుస సినిమాలతో.. చేతిలో భారీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతూ.. కొత్తగా వచ్చే హీరోయిన్లకు సైతం పోటీగా నిలుస్తోంది. ఇప్పటికే ‘‘భగవంత్‌ కేసరి, స్కందం తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన శ్రీలీల.. ప్రస్తుతం ‘ఆదికేశవ’తో లక్ ను పరీక్షించుకునేందుకు రెడీ అవుతుండగా.. బ్యూటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 20, 2023 | 04:24 PMLast Updated on: Nov 20, 2023 | 4:24 PM

Vammo Srilila Takes That Much Per Hour

ధమాకా తర్వాత ఫుల్ బిజీగా మారిపోయిన శ్రీలీల.. వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవట్లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత బిజీ హీరోయిన్ గా మారిపోయింది. వరుస సినిమాలతో.. చేతిలో భారీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతూ.. కొత్తగా వచ్చే హీరోయిన్లకు సైతం పోటీగా నిలుస్తోంది. ఇప్పటికే ‘‘భగవంత్‌ కేసరి, స్కందం తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన శ్రీలీల.. ప్రస్తుతం ‘ఆదికేశవ’తో లక్ ను పరీక్షించుకునేందుకు రెడీ అవుతుండగా.. బ్యూటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

Pawan kalyan: ఓజీలో పవన్ క్యారెక్టర్‌పై ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు

అందం, అభినయం, నటన, డ్యాన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది శ్రీలీల. తనకున్న క్రేజ్ దృష్ట్యా రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది. రీసెంట్ గా కమిట్ అయ్యే సినిమాలకు దాదాపు మూడు నుంచి ఐదు కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట. మరోవైపు బ్యూటీ అడిగినంత ఇచ్చేందుకు మేకర్స్ కూడా రెడీ అవుతున్నారట. ప్రస్తుతం ఈ అమ్మడుకు సంబంధించిన ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సినిమాల్లోనే భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన చిన్నది.. కమర్షియల్ ప్రమోషనల్ ఈవెంట్స్‌కి భారీగా వసూల్ చేస్తుందన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఒక ఈవెంట్‌లో పాల్గోంటే.. గంటకు 10 నుంచి 12 లక్షల వరకు డిమాండ్ చేస్తారట. పైగా బ్యూటీ తమ ఈవెంట్ కు వస్తే.. బ్రాండ్ విలువ పెరుగుతుందని అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. మొత్తానికి బ్యూటీ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను బాగా ఫాలో అవుతుందని అనేసుకుంటున్నారు.