సినిమా వాళ్ళ విషయంలో ఏ న్యూస్ వచ్చినా సరే అభిమానులు ప్రతి ఒక్కటి సీరియస్ గానే తీసుకుంటారు. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే దాన్ని ఏదో ఒక రకంగా పెద్దది చేసి కెలికే వరకు మనశ్శాంతిగా ఉండరు. తాజాగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ లో జరిగిన ఒక వ్యవహారాన్ని నందమూరి అభిమానులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు సోషల్ మీడియా వేదిక ఒక రకమైన యుద్ధమే జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేయడం కూడా మొదలుపెట్టారు. దానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ ప్రస్తావించకపోవడమే. అసలు ఏం జరిగింది అంటే.. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అవుతుంది. దీనితో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీ టాక్ షో అయిన అన్ స్టాపబుల్ సీజన్ 4 లో ఒక ఎపిసోడ్ కు డాకు మహారాజ్ టీం అటెండ్ అయింది. ఈ వేదికపై ఒక ఘటన చోటుచేసుకుంది. నిర్మాత బాబీని... ఎపిసోడ్ లో భాగంగా అతని డైరెక్షన్లో వచ్చిన కొన్ని సినిమాల గురించి ప్రస్తావించారు. రవితేజ హీరోగా వచ్చిన పవర్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్.. వెంకటేష్ హీరోగా వచ్చిన వెంకీ మామ అలాగే చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య ఫోటోలు అలాగే నందమూరి బాలకృష్ణ గురించి ఫోటోలు అక్కడ స్క్రీన్ పై చూపించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జై లవకుశ సినిమాను కూడా బాబి డైరెక్ట్ చేశాడు. కానీ ఆ సినిమా ఫోటో మాత్రం అక్కడ చూపించలేదు. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాలకృష్ణను ఒక రేంజ్ లో తిట్టడం మొదలుపెట్టారు. కావాలనే ఎన్టీఆర్ ను బాలకృష్ణ పక్కన పెడుతున్నారని అవమానిస్తున్నారంటూ... తిట్టడం స్టార్ట్ చేశారు. ఇది క్రమంగా తన సినిమాకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉండడంతో నిర్మాత నాగ వంశీ రియాక్ట్ అయ్యాడు. ఆ షోలో అసలు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన గాని లేదా జై లవకుశ ప్రస్తావని రాలేదని... అసలు ప్రస్తావని లేనప్పుడు దాన్ని కట్ చేయాల్సిన అవసరం ఏంటి అంటూ ఎన్టీఆర్ అభిమానులను ప్రశ్నించాడు. అలాగే తాను తారక్ సినిమాలను బాలయ్య సినిమాలను కూడా చూస్తానని.. రేపు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటే ఆయన సినిమాల కోసం కూడా ఎదురు చూస్తానంటూ కామెంట్ చేశాడు. కానీ ఇలాంటి వివాదాలు రావడం మాత్రం కరెక్ట్ కాదన్నాడు. ఇది మనందరి సినిమా అని అందరం కలిసి హిట్ చేద్దామంటూ ఎన్టీఆర్ అభిమానులను కూల్ చేసే ప్రయత్నం చేశాడు నాగ వంశీ.[embed]https://www.youtube.com/watch?v=6KbGPFzBsY8[/embed]