గడ్డం పెంచమన్న వంగా, కుదరదన్న ప్రభాస్

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో సినిమా అంటే హీరోకి కచ్చితంగా గడ్డం ఉండాల్సిందేనా...? గడ్డంతోనే మనవాడు కథ రాసుకుంటాడా...? అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 23, 2024 | 01:35 PMLast Updated on: Aug 23, 2024 | 1:35 PM

Vanga Who Grows His Beard Prabhas Who Grows His Beard

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో సినిమా అంటే హీరోకి కచ్చితంగా గడ్డం ఉండాల్సిందేనా…? గడ్డంతోనే మనవాడు కథ రాసుకుంటాడా…? అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. హీరోని గడ్డంలో చూపించడం లేదా క్లీన్ షేవ్ లో చూపించడం… అది అర్జున్ రెడ్డి అయినా యానిమల్ సినిమా అయినా సరే. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండను గడ్డంలో చాలా బాగా చూపించాడు సందీప్ రెడ్డి. ఆ లుక్ కూడా బాగానే వైరల్ అయింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ అందుకుని వంగాకు మంచి పేరు తెచ్చింది.

ఇక రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ సినిమాలో కూడా హీరోకి గడ్డం ఉంటుంది. ఈ గడ్డం లుక్ లో రణబీర్ పక్కా మాస్ గా కనిపించి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసాడు. అలాగే క్లీన్ షేవ్ లో కూడా రణబీర్ ను చాలా బాగా చూపించాడు వంగా. ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా ప్లాన్ చేసాడు. ఈ సినిమాలో కూడా గడ్డం కావాలని వంగా పట్టుబడుతున్నాడు. ప్రభాస్ ను గడ్డం పెంచాలని అడిగాడట ఈ డైరెక్టర్. అయితే తన తర్వాతి సినిమాలను దృష్టిలో పెట్టుకుని కుదరదు అని చెప్పాడట ప్రభాస్.

ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న ప్రభాస్ కు గడ్డం పెంచడం అనేది సమస్య. దాని కోసం రెండు నెలలు ఎదురు చూడాలి. వేరే సినిమాల్లో లుక్స్ కూడా మార్చుకోవాలి. కేవలం వంగా సినిమా ఒకటే అయితే సాధ్యమవుతుంది. కాని హను రాఘవపూడి, మారుతి సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్నాడు. మరి అలాంటప్పుడు గడ్డం పెంచడం అనేది అయ్యే పని కాదు. తర్వాతి ప్రాజెక్ట్ లు కూడా రెడీగా పెట్టుకున్నాడు ప్రభాస్. అలాంటప్పుడు గడ్డం అనేది అయ్యే పని కాదు. అందుకే వంగా ఇప్పుడు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నాడట. మరి ప్రభాస్ ను ఎలా చూపిస్తాడో చూడాలి.