దేవర తర్వాత “వర”… రెండోసారి వర వస్తే 1000 కోట్ల వరాలు..?
దేవర పాన్ఇండియాని షేక్ చేస్తే 670 కోట్లొచ్చాయి. ఓటీటీ బిజినెస్ తో పాటు, వ్యూస్ కూడా రికార్డులు క్రియేట్ చేశాయి. కట్ చేస్తే ఇన్ని నెలలకు జపాన్ లో రిలీజ్ అయ్యి అక్కడ కూడా దేవర దుమ్ముదులుపుతున్నాడు.

దేవర పాన్ఇండియాని షేక్ చేస్తే 670 కోట్లొచ్చాయి. ఓటీటీ బిజినెస్ తో పాటు, వ్యూస్ కూడా రికార్డులు క్రియేట్ చేశాయి. కట్ చేస్తే ఇన్ని నెలలకు జపాన్ లో రిలీజ్ అయ్యి అక్కడ కూడా దేవర దుమ్ముదులుపుతున్నాడు. ఆ ఊపుతో డిసీజన్ తీసుకున్నాడో, లేదంటే ముందే నిర్ణయించారో కాని, దేవర2 మ్యాటర్ రివీల్ చేశాడు ఎన్టీఆర్. ఆఫ్ ద రికార్డుగా డైరెక్టర్ కొరటాల శివ కూడా మీడియాకు ఉప్పందించాడు. దేవర కథేంటో చూసిన ప్రతీ ఒక్కరికి తెలుసు.. దేవర2 కథేంటో మాత్రం చూపించబోయే వాళ్లకి మాత్రమే తెలుసు. ఆ కథే టూకీగా రివీల్ చేశాడు కొరటాల శివ. ఎన్టీఆర్ అసలు పాయింట్ చెప్పాక, కొరటాల ఇంకా దాచటానికి ఏముండదు.. అదే ఇప్పుడు సెన్సేషనౌతోంది. మరో బాహుబలి లా ఈ మూవీ మారేలా ఉంది…
దేవర జపాన్ లో దుమ్ముదులుపుతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ కి అక్కడ కూడా సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉందని తేలింది. ఫైనల్ గా దేవర 2 మీద ఇప్పుడు డిస్కర్షన్ మొదలైంది. కారణం, అక్కడ ఎన్టీఆర్ ఇచ్చిన లీకు, కొరటాల శివ మీడియాకు ఇచ్చిన షాకు దేవర 2 మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచేలా ఉన్నాయి.ప్రజెంట్ తారక్ డ్రాగన్ షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు. అదయ్యాక జైలర్ 2 తీస్తున్న నెల్సన్ దిలీప్ తో నాలుగు పాత్రలున్న ప్రయోగం చేస్తాడనంటున్నారు.అదే మొదలైతే దేవర 2 కి చాలా టైం పడుతుంది. కాని దేవర2 కోసం కొరటాల శివ ప్లానింగ్ చూస్తుంటే, ఈ ఇయర్ ఎండ్ కి దేవర 2 పట్టాలెక్కేలా కనిపిస్తోంది.
మ్యాగ్జిమమ్ దసరాకు దేవర2 ప్రాజెక్ట్ మొదలవ్వొచ్చు. కథలో మార్పులకి నెలకుమించి టైం అవసరం లేదని మీడియాతో తన వర్షన్ ని షేర్ చేసుకున్నట్టున్నాడు కొరటాల శివ. దీనికి కారణం, జపాన్ లో దేవర 2 లో ఏమి ఉండబోతోందో ఎన్టీఆర్ హింట్ ఇవ్వటమే
దేవర పెద్ద కథ కాబట్టి, ముందు దేవరని మొదటి భాగంలో పరిచయం చేశారు. ఇక దేవర2 లో కథంతా వర పాత్రదే అని తేల్చాడు ఎన్టీఆర్. సో అసలు కథంతా రెండో భాగంలో ఉందని తేల్చాడు. ఇక జాన్వీ కపూర్ పాత్ర మొదటి భాగంలో కొంతే కనిపిస్తే, రెండో భాగంలో సాలిడ్ గా ఉండబోతోందని అంచనా వేసే పరిస్థితి.
మీడియాతో ఆఫ్ ద రికార్డ్ కొరటాల శివ పంచుకున్న విషయాలను చూస్తే, దేవర 2 లో వారసుడి పాత్ర మీదే పూర్తిగా రెండో భాగం వస్తుందట. క్లైమాక్స్ లో మాత్రం దేవర పాత్ర ఫ్లాష్ బ్యాక్ సీన్ తో పూర్తి చేస్తారట. వింటానికి కాస్త బాహుబలి 2 లో స్క్రీన్ ప్లే ఎలా ఉందో, అలానే దేవర2 ని ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది.
అదే నిజమైనా, వసూళ్ల వరద కన్పామ్ చేసుకోవచ్చు. హిట్ మూవీకి సీక్వెల్ వస్తే, అది హిట్ అవటం కామన్ కాబట్టే, దేవర2 లో వర పాత్ర వరంగా మారబోతోంది. దేవర 2 విషయంలో ఎగ్జైటింగ్ గా ఉన్న కొరటాల శివ ఇలా మీడియాకే హింట్లు ఇవ్వటం చూస్తే, ఇది వేగంగా పట్టాలెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి.