Varalakeshmi : కాబోయే భర్త ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే
పవర్‌ఫుల్ యాక్ట్రెస్ వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar) గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం.. సీనియర్ నటుడు శరత్ కుమార్ (Sarath Kumar) కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది వరలక్ష్మి. ఎన్నో సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన మార్కు చూపించింది వరలక్ష్మి.. రీసెంట్‌గా సంక్రాంతికి రిలీజైన హనుమాన్ సినిమాలో కూడా సూపర్ రోల్‌లో మెప్పించింది.

Varalakshmi Sarathkumar, who is famous as a villain of Kollywood, Tollywood, star woman
పవర్‌ఫుల్ యాక్ట్రెస్ వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar) గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం.. సీనియర్ నటుడు శరత్ కుమార్ (Sarath Kumar) కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది వరలక్ష్మి. ఎన్నో సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన మార్కు చూపించింది వరలక్ష్మి.. రీసెంట్‌గా సంక్రాంతికి రిలీజైన హనుమాన్ సినిమాలో కూడా సూపర్ రోల్‌లో మెప్పించింది. ఇక కాగా.. ఈ బ్యూటీ తన ఫ్యాన్స్‌కి ఓ హ్యాపీ న్యూస్‌ని షేర్ చేసింది. తన ప్రియుడు నిక్లాయ్ సచ్‌దేవ్‌తో ఆమె ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయాన్ని బయటపెట్టింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎప్పటి నుంచో సింగిల్‌గా ఉంటున్న ఈమె పెళ్లి గురించి ఇటీవల చాలానే రూమర్స్ వచ్చాయి. ఇక వీటిని నిజం చేస్తూ తాజాగా వరలక్ష్మి ముంబైకి చెందిన వ్యాపారవేత్త, గ్యాలరిస్ట్ నిక్లాయ్ సచ్‌దేవ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. మార్చి 1న వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. వచ్చే ఏడాది వీరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు బయటకు రావడంతో.. నెటిజన్లు నికోలయ్ సచ్‌దేవ్ ఎవరు అంటూ సెర్చింగ్ మొదలుపెట్టారు. వరలక్ష్మికి కాబోయే భర్త ముంబైలో ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్నారు. వీరిద్దరూ గత 14 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్యనారట.. ఎట్టకేలకు తల్లిదండ్రుల అంగీకారంతో వీరు ఒక్కటవుతున్నారు.
వరలక్ష్మి గతంలో హీరో విశాల్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లుగా చాలా రూమర్స్ వచ్చాయి. వీరిద్దరూ కలిసి బయట కనిపించిన ఫొటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యేవి. అయితే విశాల్, వరలక్ష్మి మాత్రం తాము ఫ్రెండ్స్ మాత్రమే అంటూ ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. అయినా సరే ఈ ప్రచారం ఆగలేదు. ఇక ఇప్పుడు ఏకంగా వరలక్ష్మి ఎంగేజ్‌మెంట్ ఫొటోస్ బయటకు రావడంతో ఫ్యాన్స్‌కు ఓ క్లారిటీ వచ్చినట్లైంది. ఇక.. వరలక్ష్మి కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం సౌత్ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంది. లేడీ విలన్ రోల్స్‌లో ఆమె నటనకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోతున్నారు. ధనుష్ దర్శకత్వంలో రూపొందుతున్న రాయన్ లోనూ వరలక్ష్మి నటిస్తోంది. దీంతోపాటు, మలయాళంలో కలర్స్, తెలుగులో శబరి చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది.