Varalaxmi Sarathkumar: జయమ్మ ట్విస్ట్.. వరలక్ష్మీ శరత్ కుమార్‌కు కాబోయే భర్తకు ముందే పెళ్లైందా..!
వరలక్ష్మీకి కాబోయే భర్త నికోలాయ్ ముంబాయ్‌లో వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయనకి ముంబాయ్‌లో ఓ ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. అయితే వీరి పెళ్లి డేట్ ఎప్పుడో ఇంకా చెప్పలేదు. ఇదిలా ఉంటే నికోలాయ్‌కు ఆల్రెడీ పెళ్లియిపోయిందట.

Varalaxmi Sarathkumar: పేరుకు తమిళ నటినే అయినా తెలుగులోనూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది వరలక్షీ శరత్ కుమార్. రీసెంట్‌గా.. ఈ బ్యూటీ నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చింది. ప్రముఖ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌తో ముంబయిలో ఘనంగా ఎంగేజ్ మెంట్ చేసుకుంది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ జంట అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరుపుకుంది. 14 ఏళ్లుగా వీరిద్దరూ ఒకరికికి ఒకరు బాగా తెలుసని వార్తలు వచ్చిన తరుణంలో ఓ షాకింగ్ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది.
Chinmayi Sripada: భారత్‌లోనే ఇలా? మరో వివాదంలో సింగర్ చిన్మయి
ఇక వరలక్ష్మీకి కాబోయే భర్త నికోలాయ్ ముంబాయ్‌లో వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయనకి ముంబాయ్‌లో ఓ ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. అయితే వీరి పెళ్లి డేట్ ఎప్పుడో ఇంకా చెప్పలేదు. ఇదిలా ఉంటే నికోలాయ్‌కు ఆల్రెడీ పెళ్లియిపోయిందట. అంతేకాకుండా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారన్న వార్త సోషల్ మీడియాను ఊపేస్తుంది. వరలక్ష్మీకి కాబోయే భర్తకు గతంలోనే కవితతో మ్యారేజ్ అయింది. అంతేకాక నికోలాయ్ భార్య 2010లో మిసెస్ గ్లాడ్రాగ్స్ టైటిల్‌ను గెలుచుకుంది. 2007లో కాలిఫోర్నియాలో జరిగిన మిస్ గ్లోబ్ 2011 పోటీలో కూడా కవిత పాల్గొంది. నికోలాయ్‌కు 15 ఏళ్ల కూతురు ఉందని.. తాను వెయిట్ లిఫ్టింగ్‌లో అథ్లేట్ ఛాంపియన్ అట. ప్రస్తుతం నికోలాయ్‌కు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాను ఊపేసింది. ఇక వరలక్షీ శరత్ కుమార్ హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టి.. అది పెద్దగా కలిసి రాక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా టర్న్ తీసుకుంది. ఇప్పుడీ లేడీ డాన్‌కు ఇండస్ట్రీలో మాములు క్రేజ్ లేదు.
ముఖ్యంగా టాలీవుడ్‌లో ఈ అమ్మడుకు భారీ డిమాండ్ పెరిగింది. పెద్ద పెద్ద సినిమాల్లో లేడీ విలన్ రోల్స్‌తో మెప్పిస్తూ దూసుకుపోతుంది. నిజానికి ఆమెకు ఓ రేంజ్‌లో క్రేజ్ వచ్చింది మాత్రం ‘క్రాక్’లోని జయమ్మ పాత్రే. లిటరల్‌గా ఈ పాత్రలో వరలక్ష్మి జీవించింది. క్రాక్ అంత పెద్ద విజయం సాధించిందంటే అందులో సగం క్రెడిట్ వరలక్ష్మికే దక్కుతుంది. ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘నాంది’లో కీలక రోల్ ప్లే చేసింది. గతేడాది సంక్రాంతికి వచ్చిన ‘వీరసింహా రెడ్డి’లోనూ నెగెటివ్ క్యారెక్టర్‌లో ఇరగదీసింది. ఈ ఏడాది సంక్రాంతి అరివీర భయంకర హిట్టయిన ‘హనుమాన్’లో కీలకపాత్ర పోషించింది. అంజనమ్మ పాత్రలో జీవించేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాయన్’తో పాటు కలర్స్ అనే మలయాళ సినిమా చేస్తుంది. ఇక తెలుగులో ‘శబరి’ సినిమా చేస్తుంది. మొత్తానికి వరుస సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీ.. పెళ్లైన వాడితో పెళ్లికి రెడీ అవ్వడం హాట్ టాపిక్ గా మారుతోంది.
View this post on Instagram