Varun Tej And Lavanya: వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి వేదిక ఫిక్స్.. ఎక్కడ లవ్ పుట్టిందో అక్కడే పెళ్లి..
చాలా కాలం సస్పెన్స్ తరువాత తమ లవ్‌ను ఎంగేజ్‌మెంట్‌తో గ్రాండ్‌గా రివీల్ చేశారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఫ్యాన్స్ అంతా ముందు నుంచీ అనుకున్నట్టుగానే త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు.

Lavanya Tripathi and Varun Ten Wedding Venue
జూన్ 9న హైదరాబాద్‌లోని తన ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు వరుణ్ తేజ్. ఇప్పుడు అందరి డౌట్ ఒక్కటే.. పెళ్లి ఎక్కడ ?.. అయితే ప్రజెంట్ వరుణ్, లావణ్య పెళ్లి వెన్యూ కూడా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. వీళ్లిద్దరూ ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుకోవాలి అనుకుంటున్నారట. ఇందుకోసం ఇటలీలో మంచి రిసార్ట్స్ వెతుకుతున్నారట. ఇటలీలోనే పెళ్లి చేసుకోడానికి కూడా ఓ రీజన్ ఉంది. వీళ్లిద్దరు మిస్టర్ సినిమా చేస్తున్న టైంలో ఇటలీలోనే వీళ్ల లవ్‌ట్రాక్ స్టార్ట్ అయ్యిందట. ఎక్కడ వాళ్లు లవర్స్‌గా మారారో అక్కడే పెళ్లి చేసుకుని భార్యభర్తలుగా మారాలని ఇద్దరూ కోరుకుంటున్నారట.
అందుకే ఇటలీలో పెళ్లి చేసుకునేందుకు మంచి వెన్యూ కోసం వెతుకుతున్నట్టు సమాచారం. అయితే ఎంగేజ్‌మెంట్ కుటుంబ సభ్యుల మధ్య చేసుకున్న వరుణ్ తేజ్.. పెళ్లికి మాత్రం ఫ్రెండ్స్ అభిమానులు అందరినీ పిలుస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు పెళ్లి ఇటలీలో ప్లాన్ చేయడంతో వరుణ్ లావణ్య పెళ్లి కూడా కేవలం కుటుంబ సభ్యుల మధ్య జరిగే చాన్స్ ఉంది అంటున్నారు. అయితే పెళ్లి వేధిక గురించి అధికారికంగా ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారో.. లేక ఎంగేజ్‌మెంట్ మాదిరిగానే సైలెంట్‌గా పెళ్లి కూడా కానిచ్చేస్తారా అనేది చూడాలి.