Varun Tej: వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా..!
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ ఖర్చుల గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఇటలీలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌కోసం భారీగానే ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఈ వేడుక కోసం లావణ్య ధరించిన చీర ఖరీదు రూ.10 లక్షలుగా ఉందని సమాచారం.
Varun Tej: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పెళ్లి ఫోటోలే దర్శనమిస్తున్నాయి. వీరిద్దరూ ఇటలీలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇటు మెగా ఫ్యామిలీతో పాటు అటు అల్లు ఫ్యామిలీ కూడా హాజరై సందడి చేశారు. ఈ విధంగా స్టార్ హీరోలందరూ కలిసి కనిపించడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. దీంతో వారి అభిమానులంతా సోషల్ మీడియాలో కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
Varun Tej-Lavanya wedding : ఇటలీలో వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి సందడి ఫోటోలు..
అదే సమయంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ ఖర్చుల గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఇటలీలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌కోసం భారీగానే ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఈ వేడుక కోసం లావణ్య ధరించిన చీర ఖరీదు రూ.10 లక్షలుగా ఉందని సమాచారం. ఈ పెండ్లి కోసం నాగబాబు ఎక్కడా రాజీపడలేదని తెలుస్తోంది. కొడుకు పెళ్లి కోసం భారీగానే ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ఈ వేడుక కోసం ఇటలీలోని ఎంతో ఖరీదైన ప్రాచీన బిల్డింగ్ ఎంపిక చేశారు. ఈ పెళ్లి వేడుక కోసం ఏకంగా రూ.10 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. గ్రాండ్‌గా జరిగిన ఈ పెళ్లికి మెగా, అల్లు, లావణ్య త్రిపాఠి కుటుంబసభ్యులు, సన్నిహితులు, సన్నిహితులతో పాటు దగ్గర బంధువులు దాదాపు 120 మంది హాజరయ్యారు. హల్దీ, మెహందీ, కాక్‌టెయిల్ పార్టీ, మ్యారేజ్ పార్టీ.. ఇలా అన్నీ పక్కా ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులంతా ఎంజాయ్ చేశారు.
RAM CHARAN: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఆస్కార్ అకాడమీ జాబితాలో చోటు..
అయితే ఈ వేడుకలో ఇటు మెగా ఫ్యామిలీ, అటు లావణ్య ఫ్యామిలీ మాత్రమే పాల్గొన్నారని తెలుస్తోంది. ఇక నేడు లేదా రేపు ఇరు ఫ్యామిలీలు ఇటలీ నుంచి ఇండియాకు బయలుదేరి రాబోతున్నాయి. నవంబర్ 5వ తేదీన గ్రాండ్‌గా రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు రాబోతున్నారు.