VarunTej: వరుణ్‌ తేజ్‌ మామూలోడు కాదు.. నాగబాబును పెళ్లికి ఒప్పించేందుకు ఏం చేశాడో తెలుసా..

ఎంగేజ్‌మెంట్‌ సింపుల్‌గానే జరిగినా.. పెళ్లి మాత్రం చాలా గ్రాండ్‌గా చేసుకోబోతున్నాడట వరుణ్‌. అయితే వీళ్ల ఎంగేజ్‌మెంట్‌ జరిగే వరకూ వీళ్లిద్దరి లవ్‌ మ్యాటర్‌ సస్పెన్స్‌గానే ఉంది. ఎన్ని గాసిప్స్‌ వచ్చినా ఎవరూ రెస్పాండ్‌ అవ్వలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 10, 2023 | 11:24 AMLast Updated on: Jun 10, 2023 | 11:24 AM

Varun Tej Lavanya Tripathi Share Romantic Pics From Engagement

VarunTej: మెగా ఫ్యామిలీలో కొత్త కోడలు అడుగుపెట్టబోతోంది. అంతా అనుకున్నట్టే లావణ్య త్రిపాఠి, వరుణ్‌ తేజ్‌ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా రెండు కుటుంబాల సమక్షంలో రింగ్స్‌ మార్చుకున్నారు. ఎంగేజ్‌మెంట్‌ సింపుల్‌గానే జరిగినా.. పెళ్లి మాత్రం చాలా గ్రాండ్‌గా చేసుకోబోతున్నాడట వరుణ్‌.

అయితే వీళ్ల ఎంగేజ్‌మెంట్‌ జరిగే వరకూ వీళ్లిద్దరి లవ్‌ మ్యాటర్‌ సస్పెన్స్‌గానే ఉంది. ఎన్ని గాసిప్స్‌ వచ్చినా ఎవరూ రెస్పాండ్‌ అవ్వలేదు. రీసెంట్‌గా లావణ్య ఈ రూమర్స్‌ గురించి స్పందించింది. వాళ్ల మధ్య ఉంది జస్ట్‌ ఫ్రెండ్‌షిప్‌ మాత్రమే అని చెప్పినా అది నిజం కాదని అందరికీ తెలుసు. అయితే అంతా వెయిట్‌ చేసింది వీళ్లిద్దరి లవ్‌ మ్యాటర్‌ ఎప్పుడు అఫీషియల్‌గా చెప్తారు అని. ఈ గ్యాప్‌లోనే డైరెక్ట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని షాకిచ్చాడు వరుణ్‌. జూన్‌ 9న చాలా సింపుల్‌గా తన ఇంట్లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా మీడియాకు కూడా చెప్పకుండా సింపుల్‌గా ఫంక్షన్‌ కంప్లీట్‌ చేశాడు. లావణ్య, వరుణ్‌ ఫ్యామిలీస్‌.. చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌ మాత్రమే ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు.

ఎప్పటి నుంచో గాసిప్స్‌ వస్తున్నా పట్టించుకోని వరుణ్‌ ఎంగేజ్‌మెంట్‌ పూర్తవ్వగానే తమ ఫొటోస్‌ను రిలీజ్‌ చేశారు. ట్రెడిషనల్‌ లుక్‌లో వరుణ్‌ లావణ్య జోడీ అదిరిపోయింది. ఈ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్‌ అంతా మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.