Chiranjeevi : చిరంజీవికి కోపం తెప్పించిన వరుణ్ తేజ్
ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే హీరోలలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ముందు వరుసలో ఉంటాడు. కుటుంబ సభ్యులతో ఆయన సమయం గడపటానికి ఎంతో ఇష్టపడతాడు. వయసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో సరదాగా ఉంటాడు. ముఖ్యంగా తన సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ తో ఆయన ఎంతో ప్రేమగా ఉంటాడు.

Varun Tej made Chiranjeevi angry
ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే హీరోలలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ముందు వరుసలో ఉంటాడు. కుటుంబ సభ్యులతో ఆయన సమయం గడపటానికి ఎంతో ఇష్టపడతాడు. వయసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో సరదాగా ఉంటాడు. ముఖ్యంగా తన సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ తో ఆయన ఎంతో ప్రేమగా ఉంటాడు. వరుణ్ సైతం తన తండ్రితో చెప్పుకోలేని విషయాలు కూడా.. పెదనాన్న చిరంజీవితో ధైర్యంగా షేర్ చేసుకుంటాడు. అయితే అలాంటి వరుణ్ పై మెగాస్టార్ కి కోపం వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పాడు.
హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ని వరుణ్ తేజ్ (Varun Tej) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరి లవ్ స్టోరీ చాలారోజుల వరకు సీక్రెట్ గా ఉంది. చిరంజీవికి సైతం ఆలస్యంగా తెలిసింది. అందుకే ఈ విషయంలో వరుణ్ పై చిరుకి కోపం వచ్చిందట. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి వచ్చారు. ఈ క్రమంలో యాంకర్ సుమ సరదాగా మాట్లాడుతూ.. చిరు ముందు వరుణ్ ని ఇరికించే ప్రయత్నం చేసింది. మాకు చిరు లీక్స్ అంటే చాలా ఇష్టం. కానీ మీరు వరుణ్-లావణ్య లవ్ స్టోరీని ఎందుకు లీక్ చేయలేదు. మీక్కూడా వరుణ్ చెప్పలేదా అని మెగాస్టార్ ని సుమ అడిగింది. దీనికి ఆయన బదులిస్తూ.. తనకు ప్రతి విషయం చెప్తాడు.. కానీ ఇదొక్కటి దాచాడు. చాలా విషయాల్లో తనను చూసి ఇన్ స్పైర్ అయ్యాను అంటాడు. లీక్స్ విషయంలో కూడా ఇన్ స్పైర్ అయ్యి.. తనకు ముందుగా చెప్పొచ్చు కదా. వాళ్ళ నాన్నకి కూడా చెప్పుకోలేనివి తనతో చెప్పుకుంటాడు. అలాంటిది ఈ ఒక్కటి చెప్పలేదు. ఈ విషయంలో నిజంగా నాకు ఇప్పటికీ కోపం ఉందన్నాడు.
చిరంజీవి అలా అన్నాడో లేదో పక్కనే ఉన్న వరుణ్ మైక్ అందుకొని, పెదనాన్నని కూల్ చేసే ప్రయత్నం చేశాడు. తాను చెప్పలేకపోవడానికి కారణం గౌరవంతో కూడిన భయం. అయినా మా ఫ్యామిలీలో ఫస్ట్ చెప్పింది మా పెదనాన్నకే అని వరుణ్ తెలిపాడు. మొత్తానికి వరుణ్ మాటలను బట్టి చూస్తే.. వారి లవ్ మేటర్ గురించి ఆలస్యంగానైనా మెగా ఫ్యామిలీలో ముందుగా చిరుకే తెలిసిందని అర్థమవుతోంది. ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి, వరుణ్ తేజ్ మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ మెగా అభిమానులను కన్నులపండుగలా ఉంది