Varun Tej : ఒక సెట్ కే రూ.15 కోట్లు ఖర్చు
వరుణ్ తేజ్ హీరోగా 'పలాస' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మట్కా'. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ షూట్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

Varun Tej's film 'Satta' is being directed by Karunakumara of 'Palasa' fame.
అప్పట్లో యంగ్ హీరోల సినిమాలు 10-15 కోట్ల బడ్జెట్ తో రూపొందితే గొప్ప అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు కేవలం సెట్స్ కే ఆ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘మట్కా’ కోసం.. కేవలం ఒక సెట్ కే రూ.15 కోట్లు ఖర్చు పెట్టారనే వార్త సంచలనంగా మారింది.
వరుణ్ తేజ్ హీరోగా ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మట్కా’. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ షూట్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా చిత్ర బృందం.. మేకింగ్ వీడియో విడుదల చేసింది. అంతేకాదు, “ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం.. రామోజీ ఫిల్మ్ సిటీలో 1980 నాటి వైజాగ్ ను రీక్రియేట్ చేస్తూ సెట్ వేసినట్లు” తెలిపింది. ఇదిలా ఉంటే అలనాటి వైజాగ్ సిటీని రీక్రియేట్ చేయడం కోసం ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ఆ సెట్ లో 35 రోజుల నుంచి 40 రోజుల షూట్ ఉంటుందని సమాచారం.
విభిన్న చిత్రాలతో కెరీర్ స్టార్టింగ్ లో ఎంతగానో ఆకట్టుకున్న వరుణ్ తేజ్.. కొంతకాలంగా బాగా వెనకబడిపోయాడు. వరుస పరాజయాలతో మార్కెట్ బాగా పడిపోయింది. అయినప్పటికీ ఆయన నటిస్తున్న కొత్త సినిమాలో.. కేవలం వైజాగ్ సెట్ కోసమే రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.