Chiranjeevi: చిరంజీవి, ఐశ్వర్యా రాయ్ జంటగా జగదేక వీరుడు
ఈ నెలాఖర్లోగా చిరుతో పాటు ఐష్ కి ఓ వర్షన్ కథని వినిపించబోతున్నాడు వశిష్ట. ఐతే ఇందులో రొమాన్స్ ఉండదు కాని, కథానుసారం హీరో, హీరోయిన్ల సాంగ్స్ మాత్రం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
మెగాస్టార్ కెరీర్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి ఓ మైల్ స్టోన్. అందులో శ్రీదేవి ఇంద్రజగా మెప్పిస్తే, వీరుడిగా మెగాస్టార్ మ్యాజిక్ చేశాడు. సో అలాంటి మూవీకి రీమేక్ అనలేం కాని, అదే ఫ్లేవర్ తో వశిష్ట మూవీప్లాన్ చేశాడు. కథ ఫైనల్ డ్రాఫ్ట్ కూడా రెడీ చేశాడు…
ఐతే మొన్నటి వరకు ఈప్రాజెక్ట్ అలానే ఉండిపోయింది. అందులో తన పాత్ర మాత్రమే చెప్పి ఐశ్వర్యా రాయ్ ని ఇంప్రెస్ చేసిన వశిష్ట, ఇనిషియల్ గా తననుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడు. కాని ఫైనల్ గా సినిమాకు సైన్ చేయాలంటే మరోసారి కథ వినిపించాల్సిందే. ఎందుకంటే రఫ్ స్టోరీలైన్ తో ఐష్ ని ఒప్పించిన వశిష్ట, పూర్తి కథని మాత్రం ఇంకా రాస్తున్నాడు. అది విన్నాకే డేట్లు ఇస్తానందట ఐశ్వర్యా రాయ్.
మొత్తానికి ఈ నెలాఖర్లోగా చిరుతో పాటు ఐష్ కి ఓ వర్షన్ కథని వినిపించబోతున్నాడు వశిష్ట. ఐతే ఇందులో రొమాన్స్ ఉండదు కాని, కథానుసారం హీరో, హీరోయిన్ల సాంగ్స్ మాత్రం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఐతే అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను వచ్చే సంక్రాంతి అంటే, 2024 కాకుండా 2025 కి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. సెట్లు, గ్రాఫిక్స్ కే 170 కోట్ల ఖర్చు వస్తుంటే, రెమ్యునరేషన్లు, మిగతా మేకింగ్ ఖర్చులు 130 కోట్లని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి సైరా తో పాన్ ఇండియా దాడి చేసిన చిరు, మొత్తానికి బాహుబలి లాంటి గ్రాఫిక్స్ బేస్ట్ మూవీతో పాన్ ఇండియా మార్కెట్ ని ఊపేయాలనే కల నెరవేరబోతోంది.