Venkatesh Daggubati: ఓటీటీని వదలను అంటున్న విక్టరీ వెంకటేశ్.. అసలు విషయం అదేనా..?
విక్టరీ వెంకటేష్.. రానా నాయుడు వెబ్ సిరీస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఏడాదికో ఓటీటీ ప్రాజెక్ట్ చేయడానికి పక్కా ప్రణాళిక రెడీ చేసుకుంటున్నాడు. విక్టరీ వెంకటేష్ ఓటీటీ స్పేస్‌లోకి ఈ ఏడాదే ఎంటరయ్యాడు. రానా నాయుడు సిరీస్‌తో సౌత్, నార్త్ ఆడియ్స్‌ని థ్రిల్ చేశాడు.
Venkatesh Daggubati: వెండితెరపై సత్తా చాటిన బడాస్టార్స్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌పై ఎంట్రీ ఇవ్వడానికి ఆలోచిస్తారు. తమ ఇమేజ్‌కి డామేజ్ అవుతుందేమో అని అటూవైపు అస్సలు చూడారు. కానీ ఈ విషయంలో అన్ని రూల్స్‌ని బ్రేక్ చేశాడు విక్టరీ వెంకటేష్. రానా నాయుడు వెబ్ సిరీస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఏడాదికో ఓటీటీ ప్రాజెక్ట్ చేయడానికి పక్కా ప్రణాళిక రెడీ చేసుకుంటున్నాడు. విక్టరీ వెంకటేష్ ఓటీటీ స్పేస్‌లోకి ఈ ఏడాదే ఎంటరయ్యాడు.
రానా నాయుడు సిరీస్‌తో సౌత్, నార్త్ ఆడియ్స్‌ని థ్రిల్ చేశాడు. అయితే తెలుగు ప్రేక్షకుల నుంచి ఈ ప్రాజెక్ట్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఓ ఫ్యామిలీ హీరో ఇలాంటి బోల్డ్ కంటెంట్‌లో కనిపించేసరికి చాలామంది తట్టుకోలేకపోయారు. దీంతో రానా నాయుడు సీజన్ 2 ఉండదని కామెంట్స్ వచ్చాయి. కానీ వాటిని సైంధవ్ ఈవెంట్‌లో కొట్టి పడేశాడు వెంకీ. సీజన్2 కచ్చితంగా ఉంటుంవని, కాకపోతే ఈసారి బోల్డ్ కంటెంట్‌ని తగ్గించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చాడు. రానా నాయుడు సిరీస్ చేసినందుకు హ్యాపీగా ఫీలవుతున్నట్లు సృష్టం చేశాడు వెంకటేష్. ఎక్కడకి వెళ్లినా తనని అదే పాత్రతో పిలుస్తున్నారని చెప్పుకొచ్చాడు. అందుకే ఇకపై ఏడాదికి ఒక ఓటీటీ ప్రాజెక్ట్ చేసేలా ప్రణాళిక రెడీ చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఇప్పటికే అమెజాన్, నెటి ఫ్లిక్స్ సంస్థలు తన కోసం చాలా స్క్రిప్టులు సిద్ధం చేశాయని, సైంధవ్ తర్వాత వీటిలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి బిగ్ స్క్రీన్‌పై యాక్షన్ పార్ట్‌ని, ఓటీటీలో మసాల కంటెంట్‌ని అందిస్తూ రెండు చోట్లా సత్తా చాటేలా విక్టరీ వీరుడు పక్క ఫ్లాన్ అప్లై చేస్తున్నాడు.