సంక్రాంతి సినిమాల మధ్య పోటీ ఓ రేంజ్ లో జరిగింది ఈసారి. పండగ మూడు రోజుల్లో ఎవరి డామినేషన్ కంటిన్యూ అవుతుందా అని అభిమానులు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూశారు. సినిమాలు భారీ బడ్జెట్ తో రిలీజ్ కావటం అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉండటంతో ఏం జరగబోతుంది అనేది టాలీవుడ్ పెద్దలు కూడా కాస్త ఒకన్నేసి ఉంచారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా నందమూరి బాలకృష్ణ... డాకు మహారాజ్ సినిమా విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలయ్యాయి. ఆరు రోజుల్లో విడుదలైన మూడు సినిమాలకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అయితే ఒక్క గేమ్ చేంజర్ సినిమా మాత్రం వెనకడుగు వేసింది. డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు దుమ్ము రేపేసాయి. యాక్షన్ పరంగా డాకు మహారాజ్ సూపర్ హిట్ అయితే... ఎంటర్టైన్మెంట్ పరంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా అల్లాడించింది. ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేయడంతో జనాల్లో కూడా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ బాగా పెరిగింది అని చెప్పాలి. వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది సంక్రాంతి వస్తున్నాం. అయితే ఈ సినిమా గోదావరి జిల్లాలో చూపిస్తున్న డామినేషన్ వేరే లెవెల్ లో ఉంది. అవును ఇప్పుడు బయటకు వస్తున్న కొన్ని లెక్కలు చూస్తే రామ్ చరణ్ కు బాలయ్యకు దిమ్మతిరిగే కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకు. ఈస్ట్ గోదావరిలో సంక్రాంతి రోజు గేమ్ చేంజర్ సినిమా 40 లక్షలు వసూలు చేస్తే డాకు మహారాజ్ 70 లక్షల వసూలు చేసింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం, కోటి 20 లక్షలు వసూలు చేసి చాలెంజ్ చేసింది. వాస్తవానికి గోదావరి జిల్లాలు అంటే మెగా ఫ్యామిలీకి పెట్టని కోట. అక్కడ సంక్రాంతికి వస్తున్నాం... సినిమా డామినేషన్ చూసి చాలామంది షాక్ అయ్యారు. మెగా అభిమానులు కూడా ముందు ట్రోల్ చేసినా సరే ఆ తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయారు. ఇక నందమూరి అభిమానులు కూడా తమకు థియేటర్లో తక్కువ రావడం వలనే కలెక్షన్లు తగ్గాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు కావాలనే థియేటర్లను లాక్కున్నారంటూ నందమూరి అభిమానులు తిట్టడం మొదలుపెట్టారు. ఏది అలా ఉన్నా సరే సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం విడుదలైన రెండో రోజు ఏకంగా కోటి 20 లక్షలు వసూలు చేయడం అనేది రికార్డ్ సృష్టించినట్లే. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటుగా ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే క్లాస్ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూశారు. దీనితోనే వసూళ్లు ఆ రేంజ్ లో పెరిగాయి. ఉత్తరాంధ్రలో కూడా ఈ సినిమా డామినేషన్ కంటిన్యూ అవుతుంది. వెంకటేష్ కెరీర్ లోనే భారీ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిపోనుంది సంక్రాంతి వస్తున్నాం.[embed]https://www.youtube.com/watch?v=Hu0ZPeaCiTg[/embed]