Venkatesh: ప్రోమోలతో షాక్ ఇచ్చిన విక్టరీ వెంకటేష్, సల్మాన్ ఖాన్
చిన్న టీజర్ చూసే సినిమాపై ఓ నిర్ణయానికి రాకూడదు. కాని అలా వచ్చేలా చేస్తోంది ఫిల్మ్ టీం. టీజర్ అంత నాసిరకంగా ఉంది. సరే.. వెంకీ మల్టీస్టారర్‌లు, ప్రయోగాలు చేశాడు.. సడన్‌గా మాస్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడనుకుంటే.. టీజర్ మరీ చప్పగా ఉండటంతో విక్టరీ వెంకటేష్ రాంగ్ రూట్లో వెళ్తున్నాడంటున్నారు.
Venkatesh: విక్టరీ వెంకటేష్‌తో హిట్ మూవీ డైరెక్టర్ శైలేష్ కొలను తీసిన సినిమా సైంధవ్. ఆమధ్య సైంధవ్ గ్లింప్స్ వదిలితే పేలింది. తర్వాత టీజర్ అనగానే తుస్సుమంది. నవాజుద్దిన్ సిద్దిఖి లాంటి నటుడిని డమ్మీ చేశారనంటున్నారు. చిన్న టీజర్ చూసే సినిమాపై ఓ నిర్ణయానికి రాకూడదు. కాని అలా వచ్చేలా చేస్తోంది ఫిల్మ్ టీం. టీజర్ అంత నాసిరకంగా ఉంది. సరే.. వెంకీ మల్టీస్టారర్‌లు, ప్రయోగాలు చేశాడు.. సడన్‌గా మాస్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడనుకుంటే.. టీజర్ మరీ చప్పగా ఉండటంతో విక్టరీ వెంకటేష్ రాంగ్ రూట్లో వెళ్తున్నాడంటున్నారు.
ఇంతకంటే ఘోరంగా ట్రోలింగ్స్‌కి గురైంది సల్మాన్ ఖాన్ మూవీ టైగర్ 3 ట్రైలర్. టీజర్ చూసి అబ్బో ఇది షారుఖ్ జవాన్, పఠాన్‌లా దుమ్ముదులుపుతుందనుకున్నారు. కాని రొటీన్ రోత, వాతపెట్టే యాక్షన్ మోత, మొత్తంగా కొత్త సీసాలో పాత వైన్ అనుకోవాల్సి వస్తోంది. కొండంత రాగం తీసి డమ్మీ పాట పాడినట్టు టైగర్ మూడో సీక్వెల్ ట్రైలర్ తుస్సుమంది. షారుఖ్‌కి పటాన్, జవాన్ లాంటి రెండు హిట్స్‌తో రూ.2 వేల కోట్ల డ్రీమ్ సాధ్యమైంది. దంగల్‌తో గతంలోనే రూ.2 వేల కోట్ల రికార్డ్ ఆమిర్ ఖాన్‌కి సొంతమైంది. మరి ఖాన్ త్రయంలో సల్మాన్‌కే వెయ్యికోట్లు కాదు కదా.. కనీసం రూ.500 కోట్ల డ్రీమ్ కూడా తీరలేదు. ఆ కోరిక టైగర్ 3తో తీరుతుందని అంచనాలు పెంచారు. కాన ట్రైలర్ చూస్తే ఇది గట్టెక్కితే చాలనేలా ఉందంటున్నారు.