Venkatesh, Anil : వెంకీమామ-అనిల్ రావిపూడి సందడి మామూలుగా లేదుగా..

టాలీవుడ్(Tollywood) లో కొన్ని కాంబోలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వాళ్ల కాంబినేషన్ లో ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో అనిల్ రావిపూడి (Anil Ravipudi) - విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) కాంబో కూడా ఒకటి.. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో ఎఫ్2(F2), ఎఫ్3 (F3) సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 29, 2024 | 10:09 AMLast Updated on: Feb 29, 2024 | 10:09 AM

Venkimama Anil Ravipudi Buzz Is Not Usual

టాలీవుడ్(Tollywood) లో కొన్ని కాంబోలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వాళ్ల కాంబినేషన్ లో ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో అనిల్ రావిపూడి (Anil Ravipudi) – విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) కాంబో కూడా ఒకటి.. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో ఎఫ్2(F2), ఎఫ్3 (F3) సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కూడా గట్టిగానే రాబట్టాయి. దీంతో.. ఈ కాంబో మళ్లీ ఎప్పుడు రిపీట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ల ఎదురు చూపులకు చెక్ ఈ కాంబినేషన్ ముచ్చటగా మరోసారి రిపీట్ కాబోతోంది. దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి- వెంకీ సినిమా రాబోతోంది. ఈ వార్త వినగానే ఆడియన్స్ ఇప్పటి నుంచే సంబరాలు స్టార్ట్ చేశారు.. కాగా.. ఇప్పుడు ఈ మూవీ టైటిల్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తెలుగు ఇండస్ట్రీలో కామెడీ జానర్ లో ఎంతో కొంత వెలితి ఉందని అందరూ తెలుగు ప్రేక్షకులు అనుకునేవాళ్లు. కానీ, ఎప్పుడైతే అనిల్ రావిపూడి డైరెక్టర్ అయ్యాడో అప్పటి నుంచి ఆ వెలితి తీరినట్లు అయ్యింది. తనదైన పంచులతో, మార్కు డైలాగులతో ప్రతి సీన్ లో కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తుంటాడు. ఇక.. వెంకటేష్‌కి అయితే మెయిన్‌ స్ట్రెంగ్త్‌ కామెడీనే.. ఆ జోనర్ లో తెరకెక్కిన ఎన్నో వెంకటేష్ సినిమాలు మంచి విజయాలు సాధించాయి.. అలాంటిది వీళ్లిద్దరూ మళ్లీ కలిస్తే ఆ కాంబినేషన్ మామూలుగా ఉండదు కదా.. అందుకే. ఆ క్రేజ్‌కు తగ్గట్లుగానే.. ఈ చిత్రానికి మేకర్స్.. డిఫరెంట్ టైటిల్ ను అనుకుంటున్నారట.. గ్రామీణ నేపథ్యంలో సాగనున్న ఈ మూవీ టైటిల్ ను దిల్ రాజు ఇటీవల రిజిస్టర్ చేయించారట.. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ను మేకర్స్ తాజాగా ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది..

కాగా.. వెంకటేష్‌ రీసెంట్‌గా సైంధవ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ యావరేజ్ టాక్ సంపాదించుకుంది.చాలా రోజుల తర్వాత సైంధవ్ లో ఫుల్ యాక్షన్ రోల్ లో కనిపించారు వెంకీ.. అయితే.. అది ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాకపోవడంతో మళ్లీ తన ఎంటర్టైన్మెంట్ జోన్ కు వచ్చేశారు. దీంతో.. ఈ మూవీని అనిల్ కూడా చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకుంటున్నారట.. సైంధవ్ ఎఫెక్ట్ ఈ మూవీపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మరో వైపు ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటించనుందన్న వార్త కూడా వైరల్ అవుతోంది. ఇలా.. పలు క్రేజీ కాంబినేషన్లతో రిపీట్ కాబోతున్న ఈ మూవీపై ఇప్పుటి నుంచే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఏర్పడింది.