Venu Swamy: వేణు స్వామి కొత్త అవతారం.. ఏ సినిమాల్లో నటించాడో తెలుసా..?
హీరో,హీరోయిన్ల కంటే ఎక్కువ వైరల్ అయ్యే వేణు స్వామి.. కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేశారన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అవును.. నిజం.. మీరు విన్నది కరెక్టే. వేణు స్వామి ఓ సినిమాలో నటించారు.

Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కడు వేణు స్వామి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. స్టార్ హీరోలు, హీరోయిన్ల జాతకాలపై సంచలన ప్రకటనలు చేస్తూ.. సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయారు. కేవలం జాతకాలు చెప్పడమే కాదు.. హీరోయిన్ల ఇంట్లో పూజలు చేయించి తన పూజల వల్లే హీరోయిన్లకు ఫేమ్ వచ్చిందని చెప్పుకోవడంలోనూ ఆయన ఫేమస్. ఇలా తన జ్యోతిష్య పాండిత్యాన్ని మొత్తం సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిప్పుతూ.. హీరో,హీరోయిన్ల కంటే ఎక్కువ వైరల్ అయ్యే వేణు స్వామి.. కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేశారన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Saindhav Trailer: వెంకీ మామ విశ్వరూపం.. ఇంత వయొలెన్స్ ఏంటి మామ..!
అవును.. నిజం.. మీరు విన్నది కరెక్టే. వేణు స్వామి ఓ సినిమాలో నటించారు. జగపతిబాబు హీరోగా చేసిన ‘జగపతి’ అనే తెలుగు సినిమాలో చిన్న పాత్రలో అలా కనిపించారు. అయితే ఇది కూడా గుడిలోని అర్చకుడు వేషంలో. ఇక ఈ సినిమాలో ఆయనకి రెండు డైలాగులు కూడా ఉన్నాయి. కాకపోతే ఈ సినిమా 2005లో రావడం, అప్పుడు వేణుస్వామి ఎవరనేది పెద్దగా తెలియకపోవడం లాంటి వాటి వల్ల ప్రేక్షకులు పెద్దగా గుర్తించలేకపోయారు. అలానే ప్రిన్స్ మహేష్‌బాబు నటించిన ‘అతడు’ సినిమాలో సైతం ఆయన ఓ పాటలో కనిపించారు. వేణు స్వామి.. జాతకాలు చెప్పకముందు గతంలో పలు సినిమాల్లో నటించారని తెలుస్తోంది.
అంతే కాదు.. సినిమాలకు ముహుర్తాలు పెట్టినట్లు చెప్పుకునే వారు. సినిమాలకు ప్రొడక్షన్లో కూడా పని చేశానని చెబుతూ ఉంటారు. ఈ విషయాల్లో నిజం ఎంతో తెలియదు కానీ.. ఆయన సినిమాల్లో నటించిన ఈ సీన్స్‌కు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.