వివాదస్పద జాతకాలతో పాపులర్ అయిన వేణు స్వామి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. బిగ్ బాస్ 8 లో కంటెస్టెంట్ గా ఆయనకు పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకోసం వేణు స్వామి భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు చెబుతున్నారు. సినీ సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు, స్పోర్ట్స్ పర్సన్స్ జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు వేణుస్వామి. ఈయన చెప్పిన జాతకాల్లో ఒక్క నాగ చైతన్య, సమంత విడాకుల అంశం తప్ప... మిగతా అంచనాలన్నీ దాదాపు ఫెయిల్ అయ్యాయి. లేటెస్ట్ గా ఏపీ ఎన్నికల్లో జగన్ మళ్ళీ గెలుస్తారని చెప్పాడు. అది అట్టర్ ప్లాఫ్ అవడంతో జాతకాలు చెప్పడం మానేస్తానని కూడా ప్రకటించాడు వేణుస్వామి. వీడియోలు, మీమ్స్, ట్రోల్స్ తో సోషల్ మీడియాలో కనిపించే వేణుస్వామిని బిగ్ బాస్ లోకి పిలిచారు. ఈమధ్యే వేణుస్వామిని స్టార్ మా ప్రతినిధులు కాంటాక్ట్ అయ్యారట. బిగ్ బాస్ లోకి రావడానికి ఓకే... కానీ రోజువారీగా ఇచ్చే రెమ్యునరేషన్ భారీగా కావాలని అడిగినట్టు తెలిసింది. తెలుగు బిగ్ బాస్ లో ఇప్పటిదాకా ఏ కంటెస్టెంట్స్ తీసుకోనంత రెమ్యునరేషన్ ని వేణుస్వామి డిమాండ్ చేసినట్టు చెబుతున్నారు. సీజన్ 8 లో ఆయన ఉంటే వ్యూస్, TRP రేటింగ్స్ పెరుగుతాయని అంచనాల్లో ఉంది స్టార్ యాజమాన్యం. అందుకే వేణుస్వామి కోరినంత ఇచ్చేందుకు కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్టార్ట్ అవబోతోంది. ఈసారి విరూపాక్ష ఫేమ్ సోనియా సింగ్, కమెడియన్ బంచిక్ బబ్లూ, యూట్యూబ్ స్టార్ నేత్ర ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. జబర్దస్త్ షో నుంచి పొట్టి నరేష్, కిరాక్ ఆర్పీ, బుల్లెట్ భాస్కర్ లో ఒకరిద్దరికి ఛాన్స్ రావొచ్చట. ఇంకా బర్రెలక్క, కుమారీ ఆంటీ, ఖుషిత కల్లపు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 8కి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తారని టాక్.