Venu Swamy: ప్రభాస్‌‌ను టార్గెట్ చేసిన వేణుస్వామి.. దొరికితే ఇరగదీస్తామంటున్న ఫ్యాన్స్

వేణు స్వామి.. సెలబ్రిటీల మీద ఏవో ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. తాను ఫేమస్ అవ్వడం కోసం హీరో హీరోయిన్ల పేర్లు వాడుకుంటూ తన పాపులారిటీని పెంచుకునేందుకు ఆరాట పడుతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 2, 2024 | 02:26 PMLast Updated on: Jan 02, 2024 | 2:26 PM

Venu Swamy Once Again Make Controversial Comments On Celebrities

Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కుడిగా చెలామణి అవుతున్న వేణు స్వామి.. వివాదాల స్వామిగా మారుతున్నాడు. సెలబ్రిటీల జాతకాలే టార్గెట్‌గా చెలామణి అవుతున్నాడు. తాను ఫేమస్ అవ్వడం కోసం సినీ తారలు, క్రీడాకారుల జాతకాలపై లేనిపోని పుకార్లు పుట్టిస్తూ.. ఈజీగా క్రేజ్‌ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నాగచైతన్య, సమంత ఎక్కువ కాలం కలిసి వైవాహిక జీవితం గడపలేరంటూ వారి పెళ్లి సమయంలో వేణుస్వామి చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే నాలుగేళ్లు తిరగక ముందే చైతూ, సమంత విడాకులు తీసుకోవడంతో వేణుస్వామి పేరు వార్తల్లో నిలిచింది.

PONNAM PRABHAKAR: ఎమ్మెల్యే చిలిపి పని.. వివాదంలో మంత్రి పొన్నం..

ఇక.. అప్పటి నుంచి వేణు స్వామి.. సెలబ్రిటీల మీద ఏవో ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. తాను ఫేమస్ అవ్వడం కోసం హీరో హీరోయిన్ల పేర్లు వాడుకుంటూ తన పాపులారిటీని పెంచుకునేందుకు ఆరాట పడుతున్నాడు. వేణుస్వామి గతంలో పవన్‌ కళ్యాణ్‌, ఎన్టీఆర్, ప్రభాస్ ఫేమ్‌ను వాడుకొని ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు కూడా మరోసారి అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు. ఈ క్రమంలోనే వచ్చే ఉగాది నుంచి కొందరు సెలబ్రిటీల జాతకాలు దారుణ పరిస్థితుల్లోకి వెళ్తున్నాయంటూ వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా కొనసాగుతున్న ఒక స్టార్ హీరో ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది సినిమాలకు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడంటూ షాకింగ్‌ న్యూస్ చెప్పారు. ఆ స్టార్‌ హీరో తీవ్రమైన అనారోగ్యం బారిన పడతారని.. ఆయనకు వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా నేను నటించలేను అంటూ ఆయనే రిటైర్మెంట్ ప్రకటించబోతారంటూ చెప్పడంతో ఫ్యాన్స్‌ షాకవుతున్నారు. మరోవైపు ఓ స్టార్‌ యాంకర్‌పై కూడా ఆయన షాకింగ్‌ కామెంట్‌ చేశాడు వేణుస్వామి.

ఇండస్ట్రీలో ఉన్న ఓ స్టార్‌ యాంకర్‌ వ్యక్తిగత జీవితం బట్టబయలు అవుతుందని, రోడ్డున పడే పరిస్థితి దాపురిస్తుందన్నాడు. వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన చెప్పిన ఒకటి, రెండు విషయాలు నిజమైనంత మాత్రాన అన్నీ నిజమైపోతాయా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేణు స్వామి.. తాను ఫేమస్ కావడం కోసం ఇలా సెలబ్రిటీల జీవితాలపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా సెలబ్రిటీల మీద అవాకులు చెవాకులు వాగి.. ఫేమస్ అవ్వాలన్న ఆలోచన నుంచి వేణు స్వామి బయటకు రావాలంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఇష్టారీతిన కామెంట్లు చేస్తే.. ఏదో రోజున తగిన ఫలితం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.