వేణు స్వామి మరో సంచలనం.. ప్రభాస్ చావుపై జ్యోతిష్యం.. ఆ ఇద్దరు స్టార్స్ ఆత్మహత్య చేసుకుంటారంటూ..!

జ్యోతిష్యం అంటే ఎవరైనా బాగుపడడానికి చెప్పించుకుంటారు.. బలైపోవడానికి కాదు. అలాగే జ్యోతిష్కుడు అంటే అవతల వారిని భయపెట్టేలా కాదు.. నమ్మకాన్ని ఇచ్చేలా ఉండాలి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 21, 2025 | 07:23 PMLast Updated on: Mar 21, 2025 | 7:23 PM

Venu Swamy Sensational Comments

జ్యోతిష్యం అంటే ఎవరైనా బాగుపడడానికి చెప్పించుకుంటారు.. బలైపోవడానికి కాదు. అలాగే జ్యోతిష్కుడు అంటే అవతల వారిని భయపెట్టేలా కాదు.. నమ్మకాన్ని ఇచ్చేలా ఉండాలి. అంతేకానీ అన్నం పెడుతున్న జ్యోతిష్యాన్ని నమ్ముకుని అడ్డమైన అబద్ధాలన్నీ చెబుతూ సోషల్ మీడియాను వాడుకోవడానికి కాదు. తాజాగా మనం మాట్లాడుకుంటున్నది ఎవరి గురించి అర్థమయ్యే ఉంటుంది. ఆ మహానుభావుడు ఇంకెవరో కాదు వేణు స్వామి. ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్టు వాగుతూనే ఉంటాడు ఈయన. ఎన్నిసార్లు పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చినా, వార్నింగ్ ఇచ్చిన మనోడు మాత్రం మారడు. సోషల్ మీడియాలో నోటికి వచ్చింది చెబుతూ ఇండస్ట్రీలో ఎవరిని పడితే వారిని ఏది పడితే అది అంటూ వైరల్ అవ్వాలని చూడడమే వేణు స్వామి లక్ష్యం అనేది చాలామందికి తెలుసు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు వేణు స్వామి.

తాజాగా ఈయన ఆడియో ఒకటి బయటికి వచ్చింది. అందులో ఏకంగా టాలీవుడ్ ప్రముఖుల చావు గురించి చెబుతున్నాడు వేణు స్వామి. ఇంతకుముందే ఈయన ఇంటర్వ్యూలలో ప్రభాస్ కెరీర్ అయిపోయిందని.. ఇక ఆయనకు హిట్టు సినిమాలు రావు అంటూ ఏది పడితే అది మాట్లాడాడు. అంతేకాదు రాబోయే రెండు మూడేళ్లలో టాలీవుడ్ లో ఒక ప్రముఖ హీరో, హీరోయిన్ ఆత్మహత్య చేసుకుంటారని జ్యోతిష్యం చెప్పాడు. నాగచైతన్య, శోభిత గురించి కూడా ఏది పడితే అది మాట్లాడి అనవసరంగా బుక్కయ్యాడు. ఇదిలా ఉంటే తాజాగా వేణు స్వామికి సంబంధించిన సంచలన ఆడియో లీక్ అయ్యింది. ఆ వీడియో ప్రకారం… వేణు స్వామి జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా ముగ్గురు స్టార్స్ చనిపోతారని చెప్పారు. ఆయన చెప్పిన అడియోలో సమంత రూత్ ప్రభు, విజయ్ దేవరకొండ, ప్రభాస్ పేర్లు ఉన్నాయి. సమంత, విజయ్ దేవరకొండలో ఎవరో ఒకరు సూసైడ్ చేసుకోవడం ఖాయమన్నారు. ఇక వేణు స్వామి లెక్క ప్రకారమైతే విజయ్ దేవరకొండ సూసైడ్ చేసుకుంటారంటూ ఆడియోలో మాట్లాడారు. అక్కడితో ఆగకుండా అన్నీ మున్ముందు తెలుస్తాయని.. మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారని చెప్పినట్టుగా ఆడియోలో రికార్డు అయ్యింది.

ఇక ప్రభాస్ గురించి కూడా మాట్లాడుతూ.. ప్రభాస్ కు శరీరమంతా గాయాలే ఉన్నాయని.. ఆయన ఎవ్వరికీ చెప్పడం లేదన్నారు. అందుకే రాజా సాబ్ చిత్రాన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నారని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ ముందు జరగబోతున్నాయని.. అన్నీ అయిన తర్వాత మాట్లాడుకుందామని చెప్పాడు వేణు స్వామి. అయితే జ్యోతిష్యం అడ్డుపెట్టుకొని అవతలి వ్యక్తుల చావుల గురించి మాట్లాడడం ఏంటి అని విమర్శలు వస్తున్నాయిప్పుడు. కోట్లాది మంది అభిమానులు ఉన్న హీరో హీరోయిన్ల గురించి ఇలా అభ్యంతరకరంగా మాట్లాడిన వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు ఫాన్స్. గతంలో కూడా వేణు స్వామికి ఇలాంటి జ్యోతిష్యాలు చెప్పొద్దు అంటూ వార్నింగ్లు చాలానే వెళ్లాయి. అయినా కూడా ఈయన మారడం లేదు. ఈసారి ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా సూసైడ్ చేసుకుంటారు అంటూ ఓపెన్ గా మాట్లాడేసాడు. మరి ఈ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకుంటారా లేదా అనేది చూడాలి.