దేవరతో పెట్టుకుంటే మటాష్… సూపర్ స్టార్ కి రివర్స్ గేర్…

దేవర ట్రెండ్ నడుస్తున్న టైం ఇది..అలాంటి టైంలో పోటీకి సీన్ లోకొచ్చాడు వెట్టయాన్. కోలీవుడ్ సూపర్ స్టార్ మీద తెలుగు జనాల్లో అభిమానానికి కొదువేం లేదు. అలానే తను హాస్పిటలైజ్ అవటం వల్ల అలా కూడా జనాల్లో సానుభూతి ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 13, 2024 | 12:50 PMLast Updated on: Oct 13, 2024 | 12:50 PM

Vettayan Movie Out Of The Race With Devara

దేవర ట్రెండ్ నడుస్తున్న టైం ఇది..అలాంటి టైంలో పోటీకి సీన్ లోకొచ్చాడు వెట్టయాన్. కోలీవుడ్ సూపర్ స్టార్ మీద తెలుగు జనాల్లో అభిమానానికి కొదువేం లేదు. అలానే తను హాస్పిటలైజ్ అవటం వల్ల అలా కూడా జనాల్లో సానుభూతి ఉంది. అయినా వెట్టయాన్ కి వేటు తప్పట్లేదా..? ప్రజెంట్ దేశవ్యాప్తంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ జోరు కనిపిస్తోంది. తన పాన్ ఇండియా మూవీ దేవర వెయ్యికోట్ల వసూళ్ల వేటలో ఉంది. అదిచూసే వెట్టయాన్ ని వాయిదా వేయాలనుకున్నారు. దీపావళికే విడుదల అంటూ లీకులు కూడా వచ్చాయి…కాని సడన్ గా సైలెంట్ గా వెట్టయాన్ ని రిలీజ్ చేశారు. అది కూడా టైటిల్ మార్చకుండా, తమిళ టైటిల్ తోనే రిలీజ్ చేశారు..అదే కొంపముంచిందా? దేవర దెబ్బకి సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా సైలెంట్ అవ్వాల్సి వచ్చిందా..?

కాలిన పెనం మీద నీల్లు చల్లితే క్షనాల్లో ఆవిరౌతాయి…దేవర అంత దూకుడుగా, దూసుకెళుతుంటే, తనతో పోటీ పడితే ఏమౌతుందో, స్వామ్ మూవీతో తేలింది. అది విడుదలైన మొదటి ఆటకే అటకెక్కింది. కథ బాగున్నా, మేకింగ్ లో ప్రయోగం చేసినా, ఎవరెంతగా పాజిటివ్ రివ్యూలిచ్చినా, దేవర బాక్సాఫీస్ మీద చేస్తున్న దాడిలో కిందపడి నలిగిపోయింది. అచ్చంగా అలాంటి పరిస్థితి కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వెట్టయాన్ కి వచ్చింది

అసలు వెట్టయాన్ అంటూ తమిళ టైటిలే పెట్టి తెలుగులో ఎందుకు రిలీజ్ చేశారు. తెలుగోల్లు పిచ్చోల్లా అన్న డిస్కర్షన్ జరుగుతుంటే, తమ ఉద్దేశ్యం అదికాదంది ఫిల్మ్ టీం. పాన్ ఇండియా లెవల్లో ఒకటే టైటిల్ ఉండాలనుకుందట. తెలుగులో వేటగాడు టైటిల్ అందుబాటులో లేకపోయే సరికి తప్పలేదట. ఇది కాస్త కామెడీగానే ఉన్నా, కనీసం తెలుగు జనాలను గౌరవించి, ఈ మాత్రం వివరైనా ఇచ్చారనే రెస్పాన్స్ వస్తోంది

ఏదేమైనా పాన్ ఇండియా లెవల్లో దేవర వసూళ్లకి రజినీకాంత్ వెట్టయాన్ గండి కొడుతుందన్నారు. కాని వెట్టయానే వెయ్యి అడుగులు వెనకేయబోయి, ఎందుకో సైలెంట్ గా వచ్చేయాల్సి వచ్చింది. దీపావలికి రిలీజ్ ని వాయిదా వేస్తారనే ఎనౌన్స్ మెంట్ వస్తుందన్నారు. కాని రజినీకాంత్ హెల్త్ ఇష్యూ వల్ల దర్శక నిర్మాతలు డిసీజన్ తీసుకోవటంలో కంగారుపడ్డట్టున్నారు.

ఏదేమైవెట్టయాన్ అనే మూవీ పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి హాంగామా లేకుండా రిలీజైంది. సరే రజినీకాంత్ గొప్పతనం అందరికి తెలిసిందే.. తన అనారోగ్యం వల్ల సరైన ప్రమోషన్లు చేయలేకపోయాడు.. తనమీద తెలుగు జనాలకు అబిమానం తగ్గేది లేదు. పరిస్తితిని అర్ధం చేసుకుని, వెట్టయాన్ చూద్దాములే అనుకున్నారు. కాని ఏమైంది, ఇక్కడ కథలో గ్నాన్ వేల్, పెట్టిన మలుపులు సినిమా గెలుపుకి కారనం అయ్యేలాలేదు

కోలీవుడ్ లో రజినీకాంత్ రేంజ్ టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి లేదు. వయసు పరంగా, ఇమేజ్ పరంగా అక్కడ రజినీదే నెం.1 పొజీషన్. కాని పాన్ ఇండియా లెవల్లో త్రిబుల్ ఆర్ తర్వాత తారక్ రేంజ్, ఇమేజ్ పెరిగింది. రాజమౌలి లేకున్నా, మరో స్టార్ కాస్ట్ సపోర్ట్ లేకున్నా, పాన్ ఇండియా లెవల్లో ఈ పాటికే 850 కోట్ల వసూళ్లు రాబట్టగలిగాడు. కాబట్టే దేవర దూకుడు కింద రజినీ కాంత్ వెట్టయాన్ నలిగిపోతుందని అంతా అంచనా వేసినట్టే జరుగుతోంది

ఇక వెట్టయాన్ కథ విషయానికొస్తే, చట్టం నుంచి తప్పుంచుకోవాలనుకునే వాళ్లను పరిది దాటి శిక్షించే ఎస్పీ, అమ్మాయి రేప్ అండ్ మర్డర్ విషయంలో ఇన్నోసెంట్ ని ఎన్ కౌంటర్ చేస్తాడు… ఇంతకి అసలు దోషి ఎవరు, ఎలా అతనికి శిక్ష పడింది. ఈ ప్రాసెస్ లో సమాజంలో ఉన్న లోపాలేంటో చూపించే ప్రతయ్నం చేశాడు గ్నాన్ వేల్.

కథ బాగుంది, సందేశం అదరింది. ఫస్ట్ హాఫ్ లో ఊపుంది. ఎటొచ్చి సెకండ్ హాఫ్ లోనే సాగతీత ఎక్కువై, ఓవరాల్ గా ఓ ఫార్ములా మూవీ అనిపించింది. రజినీ కాంత్, అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్ అండ్ కో నటనకి వంకపెట్టలేం. కాని దేవర వసూళ్లకి బ్రేక్ వేయటం కాదు, దేవర దూకుడే వెట్టయాన్ కి సౌత్, నార్త్ లో బ్రేక్ వేసేలా ఉంది. ఒక్క తమిల నాడులో తప్ప వెట్టయాన్ ఎక్కడా కూడా దేవరకి పోటీ ఇచ్చేలా లేదు. టాక్ కూడా షాక్ ఇచ్చేలానో, కలెక్షన్ల కిక్ ఇచ్చేలానో లేదు…