బాహుబలి, ఆర్ఆర్ఆర్ కాపీ… ఛావా.. ఓవర్రేటెడ్ క్రింజ్ ట్రైలర్, 4 సినిమాలు కాపీ
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన 'ఛావా' ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ ను ఎట్టకేలకు రిలీజ్ చేసారు.
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఛావా’ ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ ను ఎట్టకేలకు రిలీజ్ చేసారు. ‘ఛావా’ చిత్రం మరాఠీ యోధుడు ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. మరాఠా సామ్రాజ్య కీర్తిని నిలబెట్టి, ఢిల్లీ సుల్తానుల నుండి దానిని రక్షిస్తానని వాగ్దానం చేసే ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రను విక్కీ కౌశల్ పోషించాడు. అక్షయ్ ఖన్నా.. మొఘల్ రాజు ఔరంగజేబు పాత్రలో నటించాడు. ఇక రష్మిక మందన్న ఈ సినిమాలో మహారాణి పాత్రలో కనిపించనుంది.
ట్రైలర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఇక మేకింగ్ పరంగా కొన్ని సీన్స్ ఆకట్టుకోగా మెజారిటీ కాపీ సీన్స్ అనే కామెంట్స్ వస్తున్నాయి. బాజీరావు మస్తాని, పద్మావత్, తానాజి సినిమాల సిన్స్‌ను కాపీ చేసారని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. “ఛావ ట్రైలర్” ఊహించినంత గొప్పగా లేదని… ట్రైలర్ కు వచ్చిన హైప్ కు ట్రైలర్ కు మ్యాచ్ కాలేదు. ఎమోషన్స్ ను పండించే విషయంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడనే కామెంట్స్ వస్తున్నాయి. ట్రైలర్ చూసినంతసేపు హడావిడిగా అనిపిస్తుంది, దీనితో పాత్రలతో లేదా కథతో కనెక్ట్ అవ్వడం కష్టమనే ఒపీనియన్ వినపడుతోంది.
సినిమా హైప్ ను పెంచే రేంజ్ లో ట్రైలర్ కట్ లేకపోవడం మైనస్. ఇలాంటి కథల్లో న్యాచురాలిటీ ఇంపార్టెంట్ కాగా అది మిస్ అయింది. గతంలో ఇలాంటి కథల విషయంలో డైరెక్టర్లు న్యాచురాలిటీ మిస్ అవ్వకుండా, కథకు ఆడియన్స్ ను కనెక్ట్ చేసే విధంగా ప్లాన్ చేసారు. ఇక విక్కీ కౌశల్ లుక్ పై కూడా సరైన ఫోకస్ చేయలేదు డైరెక్టర్. ఓవరాల్ గా “ఛావ ట్రైలర్- యావరేజ్. విక్కీకౌశల్ నటన- ఓవర్‌రేటెడ్. రష్మిక మందన్న- క్రింజ్ యాక్టింగ్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అక్షయ్ ఖన్నా… విక్కీ కౌశల్ కంటే బెటర్ గా కనిపిస్తున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
VFX అనుకున్న స్థాయిలో లేదనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వాస్తవ కథలో కాపీ సిన్స్ సినిమా రేంజ్ తగ్గించాయని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. బాహుబలిలో గద సీన్, ఆర్ఆర్ఆర్ లో టైగర్ సీన్ కూడా కాపీ కొట్టేసాడు డైరెక్టర్.