బాలీవుడ్‌కు కొత్త OG నేషనల్‌ అవార్డ్‌ కూడా తక్కువే

కొన్ని సినిమా థియేటర్‌ గేటు బైటికి వచ్చేదాకే గుర్తుంటాయి.. కొన్ని సినిమా ఇంటికి వచ్చేదాకా గుర్తుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రాణం ఉన్నంతవరకూ గుర్తుంటాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 19, 2025 | 11:45 AMLast Updated on: Feb 19, 2025 | 11:45 AM

Vicky Kaushals Performance In The Movie Chaavva Also Feels Less Than A National Award

కొన్ని సినిమా థియేటర్‌ గేటు బైటికి వచ్చేదాకే గుర్తుంటాయి.. కొన్ని సినిమా ఇంటికి వచ్చేదాకా గుర్తుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రాణం ఉన్నంతవరకూ గుర్తుంటాయి. అలాంటి అరుదైన సినిమాల్లో ఒకే విక్కీ కౌశల్‌ హీరోగా వచ్చిన “ఛావా”. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభు మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విక్కీ కౌశల్‌ కెరీర్‌ను ఎక్కడికో తీసుకువెళుతుంది అనడంలో ఎలాంటి డౌట్‌ లేదు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో.. దినేష్ విజన్ ఈ సినిమా ప్రొడ్యూస్‌ చేశారు. నిజానికి ఈ సినిమాను పుష్ప-2కి పోటీగా రిలీజ్‌ చేయాలి అనుకున్నారు. కానీ పుష్ప టీంతో జరిపిన చర్చల తరువాత సినిమా రిలీజ్‌ పోస్ట్‌ఫోన్‌ అయ్యింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం అనంతరం మొఘల్ సామ్రాజ్యాధిపతి ఔరంగజేబు తనకు పోటీ లేదని గర్వంతో విర్రవీగుతుండగా.. కదనరంగంలోకి అడుగిడతాడు శంభు మహారాజ్. ఛత్రపతి శివాజీ తనయుడిగా స్వరాజ్యాన్ని స్థాపించడమే ధ్యేయంగా సింహంలా ముందుకు సాగే శంభును ఎదిరించడానికి లక్షల మంది మొఘల్ సైన్యానికి చేతకాదు.

అయితే.. సంఘమేశ్వర్ లో శంభు మహారాజ్ అతితక్కువ సైన్యంతో ఉన్నాడని తెలుసుకున్న ముఘలులు దొడ్డిదారిన అతడ్ని బంధించడానికి ప్రయత్నిస్తారు. వేల మందిని ఒంటి చెయ్యితో ఎదిరించి.. చేతులు సంకెళ్ళతో కట్టేసేవరకు పోరాడుతూనే ఉంటాడు శంభు. అనంతరం మొఘల్ సామ్రాజ్యాధిపతి ఔరంగజేబు.. చేతికి చిక్కిన శంభును ఏ స్థాయిలో హింసించాడు ? ఆ హింసను శంభు మహారాజ్ ఎంత ధైర్యంగా భరించాడు ? అనేది ముగింపు. విక్కీ కౌశల్ ఈ సినిమాలో చూపిన నట విశ్వరూపానికి నేషనల్ అవార్డ్ కూడా తక్కువే అనిపిస్తుంది. ఒక పాత్రను ఎంతలా ఓన్ చేసుకుంటే.. ఈ స్థాయిలో జీవించగలడు చెప్పండి. ముఖ్యంగా చివరి 20 నిమిషాల్లో విక్కీ నటన కన్నీరు పెట్టించడమే కాక.. మనసు లోతుల్లో బలమైన భావోద్వేగానికి మేలుకొలుపుతుంది. కళ్లల్లో ధీరత్వమే కాదు, గొంతులో గంభీరతను కూడా అద్భుతంగా పండించాడు విక్కీ కౌశల్. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ ఏడుస్తూ బయటికి వస్తున్నారంటే విక్కీ యాక్టింగ్‌ వాళ్లకు ఏ రేంజ్‌లో కనెక్ట్‌ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.

పుష్ప-2తో పాటు రష్మిక మందన్న అకౌంట్‌లో ఛావాతో మరో బ్లాక్‌బస్టర్‌ పడింది. ఎడబాటును, భర్త బాధను మానసికంగా భరించిన భార్యగా ఆమె పాత్రకు మంచి వెయిటేజ్ ఉంది. మన తెలుగు సినిమాల్లో కామెడీ విలన్స్ గా చూపించే.. అశుతోష్ రాణా, ప్రదీప్ రావత్ లాంటి ఎంతో మంది నటులకు అద్భుతమైన పాత్రలు, ఎలివేషన్స్ పడ్డాయి. వాళ్ల యాక్టింగ్‌ చూస్తుంటే ఇంత మంచి నటుల్నా మనం సరిగా వాడుకోకుండా వేస్ట్ చేసుకుంటున్నాం అనిపిస్తుంది. ఇక ఏ.ఆర్‌ రెహమాన్ సంగీతం ఈ సినిమాని ఎలివేట్ చేసిన విధానం గురించి మరో పదేళ్లు మాట్లాడుకుంటారు. హీరోయిజం నుండి విలనిజం.. అక్కడి నుంచి హీరోయిన్ ప్రేమ, తోటి సైనికుల బాధను ఎంతో వైవిధ్యంగా ఎలివేట్ చేసిన విధానం నెక్స్ట్‌ లెవెల్‌. సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది.

అంత తక్కువ బడ్జెట్ లో, అంత మంచి అవుట్ పుట్ ఎలా ఇచ్చాడు అని ప్రతీ ఒక్కరూ షాకవుతున్నారు. ఈ సినిమాలో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ & మేకప్ వర్క్ గురించి కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. విక్కీ కౌశల్‌ బాడీ మీద దెబ్బలను ప్రోస్థేటిక్స్‌తో చాలా రియలిస్టిక్ గా చూపించిన విధానం అద్భుతం. విక్కీ తర్వాత అవార్డ్ గెలుచుకోవాల్సిన డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మేకప్ డిపార్ట్మెంట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యాక్షన్ డైరెక్టర్స్ వర్క్ కూడా అదిరిపోయింది. ముఖ్యంగా 5000 మంది ముఘల్ సైన్యంతో ఛావా పోరాడే సీక్వెన్స్ ను తెరకెక్కించిన విధానం అద్భుతం అనే చెప్పాలి. ఛావా తరువాత బాలీవుడ్‌లో విక్కీ కౌశల్ హవా మొదలవ్వడం ఖాయం.