VICTORY VENKATESH: చిరు లేకపోతే సినిమాలు మానేసేవాడిని: విక్టరీ వెంకటేశ్
మెగాస్టార్ చిరంజీవి వల్లే ఇంకా సినిమాల్లో ఉన్నానని.. లేదంటే హిమాలయాలకు వెళ్లిపోయేవాడినంటూ వెంకటేశ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
VICTORY VENKATESH: సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. సొంత టాలెంట్ తో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో వెంకటేష్. తన కెరీర్‌లో 75 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ప్రోగ్రామ్‌లో వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం వెంకీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కళియుగ పాండవులు మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన వెంకటేశ్.. ఇప్పుడు సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
MS DHONI: దటీజ్ ధోనీ.. ఫ్యాన్స్ కోసం కీలక నిర్ణయం
సైంధవ్ మూవీ వెంకటేష్ 75వ మూవీ కావడంతో వెంకీ 75 కళియుగ పాండవులు- టు సైంధవ్ అనే పేరుతో సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుక సందర్భంగా విక్టరీ వెంకటేష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి వల్లే ఇంకా సినిమాల్లో ఉన్నానని.. లేదంటే హిమాలయాలకు వెళ్లిపోయేవాడినంటూ వెంకటేశ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా తాను ఇన్ని సినిమాలు చేస్తానని అస్సలు అనుకోలేదన్నారు వెంకటేశ్. నాన్న బలమైన కోరిక, అన్నయ్య ప్రోత్సాహంతోనే హీరో అయ్యానన్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన కళియుగ పాండవులుతో ప్రారంభమైన సినీ ప్రయాణంలో.. దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్ వంటి అగ్ర దర్శకులతో కలిసి పని చేయడం అద్భుతమైన అనుభవం అని చెప్పుకొచ్చారు.
మొదట్లో తనను విక్టరీ అనే వారని.. ఆ తరువాత రాజా అని పిలిచారని.. కొన్నాళ్లు పెళ్లి కాని ప్రసాద్.. తరువాత పెద్దోడు, వెంకీ మామ ఇలా పిలుపు మారినా కానీ ప్రేక్షకుల్లో ప్రేమ మాత్రం తగ్గలేదన్నారు. అందుకే ఎప్పటికప్పుడు ఉత్సాహంగా పని చేస్తున్నానని తెలిపారు. అయితే.. తాను చాలా సార్లు కెరీర్ ని వదిలిపెట్టి వెళ్లిపోదామనుకునే వాడినని వెంకీ తెలిపారు. అయితే.. పరిశ్రమలో తొమ్మిదేళ్ల గ్యాప్ తరువాత చిరంజీవి తిరిగి వచ్చి ఖైదీ నంబర్ 150 వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారన్నారు. అప్పుడే ఈ నటన ఆగకూడదన్న విషయం తనకు అర్థమైందన్నారు. మేము ఎప్పటికీ దీనిని కొనసాగిస్తూనే ఉండాలని తెలుసుకున్నానన్నారు. తన తోటి హీరోలు నాగార్జు, బాలకృష్ణ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవారన్నారు. చిరంజీవితో కలిసి త్వరలోనే సినిమా చేస్తానంటూ గుడ్ న్యూస్ చెప్పారు. వెంకీ, చిరు కాంబోలో సినిమా అంటూ ఇప్పటి నుంచే మెగా, దగ్గుబాటి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
TSPSC: గ్రూప్ 2 పరీక్ష మూడోసారి వాయిదా.. మళ్లీ ఈసారి ఎగ్జామ్ ఎప్పుడంటే..
ఇక.. వెంకీ 75 సినిమాల వేడుక కార్యక్రమంలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. చిరంజీవి, నాని, రాణా, సురేష్ బాబు, అడవి శేష్, బ్రహ్మానందం సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే.. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు వస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఈ ముగ్గురూ రాకపోవడంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. వెంకటేష్‌కు ఎంతో స్పెషల్ అయిన ప్రోగ్రామ్‌కు ఈ ముగ్గురు రాకపోవడానికి కారణమేమిటంటూ ఆరాలు తీస్తున్నారు. అయితే.. నాని, శ్రీవిష్ణు, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ తదితరులు హాజరు కావడంతో ఈ ప్రోగ్రామ్‌కు నిండుతనం వచ్చింది.