‘విద్రోహి’ ఫస్ట్ లుక్.. సస్పెన్స్ థ్రిల్లర్.. పోస్టర్ అదిరిపోయిందిగా..!

ఈరోజుల్లో పెద్ద పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాల్లోనే మంచి కాన్సెప్ట్ లు వస్తున్నాయి. తాజాగా సీనియర్ నటుడు రవి ప్రకాష్, శివకుమార్ ప్రధాన పాత్రల్లో వస్తున్న విద్రోహి సినిమా ఫస్ట్ లుక్ చూసిన తర్వాత కూడా ఇదే ఫీలింగ్ వస్తుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 24, 2025 | 11:50 AMLast Updated on: Feb 24, 2025 | 11:50 AM

Vidrohi First Look Suspense Thriller

ఈరోజుల్లో పెద్ద పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాల్లోనే మంచి కాన్సెప్ట్ లు వస్తున్నాయి. తాజాగా సీనియర్ నటుడు రవి ప్రకాష్, శివకుమార్ ప్రధాన పాత్రల్లో వస్తున్న విద్రోహి సినిమా ఫస్ట్ లుక్ చూసిన తర్వాత కూడా ఇదే ఫీలింగ్ వస్తుంది. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఇది ఉండబోతుందని లుక్ చూస్తుంటేనే అర్థమవుతుంది. సీనియర్ నటుడు శ్రీకాంత్ చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ జరిగింది. VSV ఈ సినిమాకు దర్శకుడు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. రవి ప్రకాష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు.. మంచి టాలెంట్ ఉన్న నటుడు.. అలాగే విద్రోహి సినిమా కథ కూడా నాకు తెలుసు.. ఈ సినిమా పోస్టర్ లాంచ్ నా చేతుల మీద జరగడం ఆనందంగా ఉంది.. కచ్చితంగా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చూసి ఆడియన్స్ కూడా షాక్ అవుతారన్నాడు.. గతంలో తాను చేసిన పోలీస్ క్యారెక్టర్స్ కు భిన్నంగా ఇందులో రవి ప్రకాష్ క్యారెక్టర్ ఉంటుందని తెలిపాడు శ్రీకాంత్. ఈ సినిమాను సరికొత్త పాయింట్ తో తీసుకొస్తున్నామని దర్శకుడు వి ఎస్ వి తెలిపాడు.

సంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ సినిమాకు మ్యూజిక్ అందించిన బీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. కోబలి లాంటి మాస్ వెబ్ సిరీస్ తర్వాత రవి ప్రకాష్ నటించిన సినిమా ఇది. కచ్చితంగా థియేటర్లలో ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తానని నమ్మకంగా చెబుతున్నాడు రవి ప్రకాష్. త్వరలోనే రిలీజ్ డేట్ చెప్పనున్నారు దర్శక నిర్మాతలు.