Nayanthara: విడాకులపై క్లారిటీ.. వైరల్‌గా నయనతార ముద్దుల వీడియో..
తమ కాపురంపై వినిపిస్తున్న రూమర్లకు తనదైన స్టైల్‌లో చెక్ పెట్టాడు విగ్నేషన్. ఫ్లూట్‌మెన్‌తో కలిసి నయన్, విఘ్నేశ్‌లు ఉన్న వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోలో నయన్.. విగ్నేష్‌ని ముద్దులతో ముంచెత్తుతుంది.

Nayanthara: స్టార్ హీరోయిన్ నయనతార తన భర్త విఘ్నేష్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసింది. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని రకరకాల రూమర్స్ వైరలయ్యాయి. ఈ వార్తలకు చెక్ పెడుతూ.. నయన్ భర్త విగ్నేషన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. తమ కాపురంపై వినిపిస్తున్న రూమర్లకు తనదైన స్టైల్‌లో చెక్ పెట్టాడు విగ్నేషన్. ఫ్లూట్‌మెన్‌తో కలిసి నయన్, విఘ్నేశ్‌లు ఉన్న వీడియో షేర్ చేశాడు.
Vishwambhara: పూనకాలు లోడింగ్.. విశ్వంభర విలన్ దొరికాడు..
ఈ వీడియోలో నయన్.. విగ్నేష్‌ని ముద్దులతో ముంచెత్తుతుంది. ఇప్పడు ఈ వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. చిన్న వీడియోతో రూమర్లకు భలే చెక్ పెట్టారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళకి నయన్, విగ్నేష్‌లు విడిపోతున్నారనే వార్త ఫేక్ అని అర్ధం అవుతుందని కూడా అంటున్నారు. కాకపోతే ఆ వీడియో పాతది అంటున్నారు. నయన్, విగ్నేష్‌లు ఏడేళ్ల పాటు ప్రేమించుకొని 2022లో పెళ్లి చేసుకున్నారు. సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకి కూడా జన్మనిచ్చారు. విగ్నేష్ చాలా ఇంటర్వూస్‌లో నయన్ గురించి చాలా గొప్పగా చెప్తుంటాడు.
విగ్నేష్ లాంటి భర్త దొరకడం తన అదృష్టమంటూ నయనతార కూడా పలు సందర్భాల్లో చెప్పింది. ఇక నయన్ తన ఇన్‌స్టాలో విగ్నేష్‌ని అన్‌ఫాలో కొట్టడం టెక్నికల్ ఇష్యూ వల్ల వచ్చిన ప్రాబ్లం అని తెలుస్తుంది. మరి బయటకు వచ్చిన వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
View this post on Instagram