Nayantara : నయన్‌కు విగ్నేష్ సర్‌ప్రైజ్ గిప్ట్.. ధర తెలిస్తే షాక్ అవుతారు..
నయనతార బర్త్ డేకు ఆమె భర్త విఘ్నేశ్ శివన్ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ ‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నయనతార.. నవంబర్ 18న 39 ఏళ్లు పూర్తి చేసుకుంది.

Vignesh's surprise gift to Nayan He will be shocked if he knows the price
నయనతార బర్త్ డేకు ఆమె భర్త విఘ్నేశ్ శివన్ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ ‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నయనతార.. నవంబర్ 18న 39 ఏళ్లు పూర్తి చేసుకుంది. పుట్టినరోజు కానుకగా భర్త-దర్శకుడు మెర్సిడెస్ మేబ్యాక్‌ను బహుమతిగా ఇచ్చారు. భర్త ఇచ్చిన ఆ గిఫ్ట్ ను చూసి నయన్ చాలా మురిసిపోవడంతో పాటు బహుమతిని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది.
KCR Cabinet meeting : 4న కేసీఆర్ కేబినెట్ భేటీ.. ఇదేం షాక్.. ఇంత కాన్ఫిడెన్సా..!
నయన్ తన పుట్టిన రోజుని భర్త, ఇద్దరు కుమారులు ఉయిర్, ఉలాగ్‌లతో కలిసి జరుపుకుంది. అయితే, బర్త్ డే అయిపోయిన రెండు వారాల తరువాత.. ఆమెకి గిఫ్ట్ ఇప్పుడు వచ్చిందట. అంతేకాకుండా.. ఆ గిఫ్ట్ దాదాపు రెండున్నర కోట్ల నుంచి మూడున్నర కోట్ల వరకు ఉంటుందని అంచనా. విఘ్నేశ్, నయన్ కోసం.. జర్మన్ లగ్జరీ బెంజ్ మేబాచ్ కారుని గిఫ్ట్ గా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
లగ్జరీ కారుని చూసి నయన్ సంతోషంతో ఉప్పొంగి పోయింది. ఆ కారు ఫోటోను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. తన సంతోషాన్ని ఇలా వ్యక్తం చేసింది. “వెల్కమ్ హోమ్ యూ బ్యూటీ అంటూ.. మై డియర్ హస్బెండ్ ఇంత విలువైన మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్.. లవ్యూ..” అని నయన్ ఎమోషనల్ అయింది. ఇలా లవ్ సింబల్‌ను జోడించి ఫోటోలను షేర్ చేసింది.