Vijay Anthony: డబ్బు ప్రపంచానికి హానికరం అంటున్న బిచ్చగాడు 2 ట్రైలర్

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 11, 2023 | 08:11 AMLast Updated on: Feb 13, 2023 | 12:40 PM

Vijay Antony Bichagadu 2 Trailer

విజయ్ ఆంటోనీ అనగానే బిచ్చగాడు అనేంతలా పాపులారిటీ సంపదించుకున్నాడు. ఈయన సహజంగా కోలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణను పొందారు. బిచ్చగాడు 2016 మార్చిలో విడుదలైన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాతో పాయిజన్ లాగా మెలమెల్లగా బంపర్ హిట్ అందుకున్నారు ఆంటోనీ. ఇప్పుడు బిచ్చగాడు 2 సీక్వెల్ తో మరోడోస్ ఇచ్చేందుకు థియేటర్లలోకి రానున్నారు. ఈ సినిమా 2023లో విడుదల కానున్నట్లు తాజాగా వచ్చిన ట్రైలర్ లో తెలిపారు.

తారాగణం:
ఇక బిచ్చగాడు సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్ పతాకంపై ఆయన భార్య ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఇందులో కావ్య థపర్, దేవ్ గిల్, రాధారవి తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈచిత్రంలో కథానాయకుడిగానే కాకుండా దర్శకత్వం, సంగీతం కూడా విజయ్ ఆంటోనీ నిర్వహించడం ముఖ్యమైన అంశం. సినిమాటోగ్రఫీని ఓం నారాయణ చేపట్టగా, తెలుగు డైలాగులను భాష్యశ్రీ రాశారు.

ట్రైలర్ హైలైట్స్:
తాజాగా బిచ్చగాడు 2 స్నేక్ పీక్ ట్రైలర్ యూట్యూబ్ లో సందడి చేస్తుంది. ట్రైలర్ ఓపనింగ్ లోనే యాంకర్ వాయిస్ ఓవర్ తో ఇండియాలో ప్రముఖ కోటీశ్వరుల్లో ఒకరైన చంద్రశేఖర్ రావు అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతూ స్క్రీన్ మీద మనీ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అనే ట్యాగ్ లైన్ ని చూపించారు. వెనువెంటనే షాట్ ‎ఓపెన్ చేస్తే వైజాగ్ సముద్రతీరంలోని ఫాం హౌస్ లో విలన్ దేవ్ గిల్ స్నానం చేసి వచ్చి ఎలుకను కొండచిలువకు ఆహారంగా వేసేలా తన విలనిజాన్ని క్రూరత్వాన్ని హైలైట్ చేశారు. దీని తరువాత చనిపోయిన వ్యక్తిని చూపిస్తారు. ఆ వ్యక్తి పక్కనే ఉన్న పిల్లవాడు హీరో విజయ్ ఆ..? లేక విలన్ గా మారిన దేవ్ గిర్ ఆ..? అనే విషయం తెలియాల్సి ఉంది. ఆపై ఒక టీవీలో ప్రముఖ న్యూరో సర్జన్ గురించిన ఇంటర్వూను శ్రద్దగా వింటూ అందులోని మెదడు మార్పిడి గురించి చెప్పే విషయాన్ని తెలుసుకుంటాడు. 1818లో బాడీ టు బాడీ రక్తం మార్చడం జరిగింది. ఈ రోజుల్లో హెయిర్, గుండె, కిడ్నీలు, మార్చినట్లు మెదడును కూడా మారుస్తామని డాక్టర్ చెబుతారు. ఇలా మార్చడం వల్ల ఏంటి లాభం అని యాంకర్ అడిగిన ప్రశ్నకు గణితశాస్త్రంలో గొప్పవాడైన రామానుజన్ మెదడును.. ఇప్పటి వారిలో ప్రవేశపెట్టడం వల్ల ప్రపంచంలో అద్భుతాలు సృష్టించవచ్చు అని డాక్టర్ చెబుతారు. ఆ వెంటనే యాంకర్ మంచి వాళ్ల మెదడు మారిస్తే పరవాలేదు. అదే హిట్లర్ లాంటి వాళ్ల మెదడును మారిస్తే ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది కదా అని అడుతాడు. ఇలా అడిగిన వెంటనే సినిమాలోని సంక్షోభానికి సింబాలిక్ గా క్షుద్రదేవత విగ్రహాన్ని చూపించారు. దీనికి పరిష్కారం ఇచ్చేందుకు హీరో బిచ్చగాడు వచ్చినట్లు సినిమా టైటిల్ తో పాటూ ఆంటోనీ అని పేరు పడేలా చేయడం.. ఫ్లైట్ దుబాయ్ లో ల్యాండ్ అవ్వడం ట్రైలర్ ను ఒక రేంజ్ కు తీసుకెళ్లింది. దీనికి బ్యాక్ డ్రాప్ లో సౌండ్ కూడా గాయత్రీ మంతాన్ని బేస్ రూపంలో ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచారు. అయితే ఫ్లైట్ నుంచి హీరో దిగేలా చూపించకుండా డబ్బు ప్రపంచానికి హానికరం అంటూ సినిమా విడుదల సంబంధించిన వివరాలు రివీల్ చేశారు.