VIJAY DEVARAKONDA: రిస్క్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. షాకింగ్ నిర్ణయం..!
ఈ డౌట్ రావటానికి కారణం గౌతమ్ తిన్ననూరి మేకింగ్‌లో విజయ్ చేసే సినిమాలో పాటలు ఉండవని తెలుస్తోంది. దీనికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ పాటలు తూటాల్లా పేలుతాయి. అలాంటిది ఈ మూవీలో పాటలు లేవంటే అనిరుధ్ ఏరకంగా కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ లేదు.

VIJAY DEVARAKONDA: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా స్పై కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఇక హీరోయిన్‌గా మిస్టర్ బచ్చన్ లేడీ భ్యాగ్యశ్రీ భోర్సే నటించబోతోంది. అంతవరకు ఓకే కాని, ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మూడోసారి మరో రిస్క్ చేస్తున్నాడు. అదే పాటలు లేని సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. విజయ్ దేవరకొండ హిట్ మూవీల్లో కలిసొచ్చేది తన నటన.
Mamitha Baiju: మూడు మెరుపుతీగలకు టాలీవుడ్ ఫిదా.. వరుస ఆఫర్లు..!
తన ఆవేశం. డైలాగ్ చెప్పే విధానం. అన్నింటికీతోడు కోపంతో కూడిన ఫైట్లు, ఆ తర్వాత పాటలు. ఇవన్నీ విజయ్ దేవరకొండకి ప్లస్ అవుతాయి. కాని లైగర్‌లో అనవసరంగా తన పాత్రకి నత్తి పెట్టి.. పూరీ పాన్ ఇండియా లెవల్ తప్పు చేశాడు. పూరీ సినిమాకు బలమే డైలాగ్. అదే చెప్పకుండా హీరోకు అప్పట్లో నత్తి పెట్టారు. ఇక గీత గోవిందంలో గోవింద్‌కి ఉండే ఓపికా, ఫ్యామిలీ స్టార్‌లో హీరోకి మిస్ అయ్యింది. ఇలా తన బలం అనుకున్నవి హీరో కాని, దర్శకుడు కాని వదిలేస్తే ఏం జరుగుతుందో లైగర్, ఖుషీ, ఫ్యామిలీ స్టార్ రిజల్ట్‌తో తేలింది. ఇప్పుడు అదే మిస్టేక్ జరుగుతోందా..? ఈ డౌట్ రావటానికి కారణం గౌతమ్ తిన్ననూరి మేకింగ్‌లో విజయ్ చేసే సినిమాలో పాటలు ఉండవని తెలుస్తోంది. దీనికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ పాటలు తూటాల్లా పేలుతాయి.
అలాంటిది ఈ మూవీలో పాటలు లేవంటే అనిరుధ్ ఏరకంగా కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక ఇందులో ఫైట్లు కూడా ఉండవట. ఇన్ని అస్త్రాలను వదిలేసి, ఇక ఎలా ఫ్యాన్స్‌ని, ఆడియన్స్‌ని గౌతమ్ తిన్ననూరి ఎంటర్‌టైన్ చేస్తాడు..? ఇదే అతి పెద్ద సవాల్. ఇన్ని వదులుకుని కూడా ఈ మూవీ హిట్ అయితే, అదో సెన్సేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాని ఇది రికార్డ్ క్రియేట్ చేయకపోతే, మాత్రం విజయ్ దేవరకొండ మరో రిస్క్ చేస్తున్నట్టే.