VIJAY DEVARAKONDA: లవ్‌బర్డ్స్ నిశ్చితార్థం.. విజయ్, రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారా
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారట. అంతే కాదు నిశ్చితార్థం డేట్ కూడా ఫిక్సయిపోయిందట.
VIJAY DEVARAKONDA: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో ప్రేమ జంట పెళ్లికి సిద్ధమైందా..? ఇన్నాళ్లూ కామ్‌గా, దొంగాటలాడుతున్న లవ్‌లీ కపుల్ త్వరలో ఎంగేజ్ మెంట్ చేసుకోబోతున్నారా..? ప్రేమ పక్షుల్లా విహరిస్తున్న ఆ జంటకు w ఏడాది పెళ్లి బాజాలు మోగనున్నాయన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ప్రేమ జంట ఎవరో ఇప్పటికే అర్థమైందిగా. అవును మీరు అనుకున్నది నిజం. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారట. అంతే కాదు నిశ్చితార్థం డేట్ కూడా ఫిక్సయిపోయిందట.
TELANGANA BJP: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. పార్లమెంట్ స్థానాలకు ఇంచార్జిల నియామకం..
అందరూ అనుకున్నట్లే ఈ ఏడాదిలోనే వీరు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, ఇటు రష్మిక అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తాము అనుకున్నది జరిగిందంటూ కామెంట్లు పెడుతున్నారు. విజయ్, రష్మికల రిలేషన్ గురించి కొద్ది రోజులుగా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక విజయ్ దేవరకొండ డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ జంట గీతా గోవిందం సినిమాతో స్క్రీన్ మీద కనిపించారు. ఆ సినిమాతోనే వీరి జంటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో నిజంగా లవ్‌లో పడ్డారా అన్నట్లుగా ఆన్ స్క్రీన్ రొమాన్స్‌తో కుర్రకారును కిక్కెక్కించారు. ఆ తర్వాత రెగ్యులర్‌గా ఇద్దరూ కలిసి కట్టుగా చక్కర్లు కొడుతున్నట్లు వార్తలు హల్‌చల్ చేయడంతో.. ఆఫ్ స్క్రీన్‌లోనూ ఈ జంట మధ్య సమ్‌థింగ్ సమథింగ్ నడుస్తోందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం రష్మిక, విజయ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్.. ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్ బిజీలో ఉండగా.. రష్మిక ది గర్లఫ్రెండ్ సినిమాతో బిజీగా ఉంది. ఇలా సినిమాతో బిజీగా ఉంటూనే ఈ లవ్ బర్డ్స్ ఆడుతున్న దాగుడుమూతలకు ఇక చెక్ పడనుందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలో వీళ్లిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకోనున్నారన్న వార్త వైరల్ అవుతోంది. వీరిద్దరి ప్రేమకు ఇరువురి కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లికి సిద్ధమయ్యారని.. ఫిబ్రవరి 2వ వారంలో నిశ్చితార్థం జరుపుకోబోతున్నారని టాక్ నడుస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ క్రేజీ కపుల్ పెళ్లి పీటలు ఎక్కనున్నారంటున్నారు. మరి.. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.