Vijay Devarakonda : తండ్రి కావాలని ఉంది
హాట్ సమ్మర్‌లో (Hot summer) మంచి ఫ్యామిలీ కంటెంట్‌తో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. సీతారామమ్ (Seetharam) ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తుండగా.. గీతా గోవిందం (Geetha Govindam) తో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు పరసురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 5న విడుదల కానుండగా టీమ్ అంతా ప్రమోషన్లో పాల్గొంటుంది.

Vijay Devarakonda answered the questions asked by the media.
హాట్ సమ్మర్‌లో (Hot summer) మంచి ఫ్యామిలీ కంటెంట్‌తో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. సీతారామమ్ (Seetharam) ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తుండగా.. గీతా గోవిందం (Geetha Govindam) తో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు పరసురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 5న విడుదల కానుండగా టీమ్ అంతా ప్రమోషన్లో పాల్గొంటుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తమిళనాడులో ప్రెస్‌మీట్‌లో మీడియాతో చర్చించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో విజయ్ దేవరకొండ తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్నారు. లవ్ గురించి పెళ్లి గురించి ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తరువాత ప్రాజెక్టుల గురించి, తన పెళ్లి గురించి మాట్లాడారు. తనకు కూడా తండ్రి కావాలని ఉందని చెప్పారు. తాను లవ్ మ్యారేజే చేసుకుంటా అని కానీ ఇప్పుడు కాదని చెప్పారు. ఇక అమ్మాయి గురించి మాట్లాడుతూ.. నా పేరెంట్స్‌కు ఆ అమ్మాయి నచ్చాలి అని వివరించారు.
తమిళ్ దర్శులు కొందరు కథలు చెప్పారు. కొన్ని నచ్చాయి అని త్వరలోనే వాటిని మెటిరియలైజ్‌డ్ చేయనున్నట్లు చెప్పారు. ఫ్యామిలీ స్టార్ తరువాత దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ చిత్రం చేస్తున్నట్లు అందులో చాలా మంది తమిళ నటీనటులు పాల్గొనబోతున్నట్లు వెల్లడించారు. ఫ్యామిలీస్టార్ చిత్రం ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని.. ఏప్రిల్ 5న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నమని విజయ్ అన్నారు. రెండు వారాల తర్వాత హిందీ, మలయాళంలో రిలీజ్ చేయనునున్నట్లు వెల్లడించారు. సినిమా రన్‌టైమ్ 2.40 గంటలు. నాలుగు ఫైట్స్ ఉన్నాయని వివరించారు.