RAM CHARAN: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీలో విజయ్ దేవరకొండ
కన్నడ డైరెక్టర్ నర్తన్ ఆమధ్య రామ్ చరణ్‌ని కలిసి వినిపించిన కథ, ఇప్పుడు విజయ్ హీరోగా తెరకెక్కబోతోంది. త్రిబుల్ ఆర్ తర్వాత చరణ్ ఏం సినిమా చేస్తాడంటే అంతా నర్తన్ మూవీకే సైన్ చేశాడన్నారు. కాని తను శంకర్ సినిమా గేమ్ ఛేంజర్ చేశాడు.

RAM CHARAN: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో రౌడీ స్టార్ ఉంటే ఆ కిక్కే వేరు. కాకపోతే ఈ ఇద్దరు ఒకే తెరమీద, ఒకేసారి కనిపించటం లేదు. కానీ, ఒకే కథని మాత్రం కలిసి పంచుకుంటున్నారు. నిజమే.. రామ్ చరణ్ చేయాల్సిన సినిమా కథ, ఇప్పుడు విజయ్ దేవరకొండ ఎకౌంట్లో పడింది. కన్నడ డైరెక్టర్ నర్తన్ ఆమధ్య రామ్ చరణ్‌ని కలిసి వినిపించిన కథ, ఇప్పుడు విజయ్ హీరోగా తెరకెక్కబోతోంది. త్రిబుల్ ఆర్ తర్వాత చరణ్ ఏం సినిమా చేస్తాడంటే అంతా నర్తన్ మూవీకే సైన్ చేశాడన్నారు.
MAHESH BABU-ALIA BHATT: కొత్త డౌట్స్.. మహేష్‌కు జోడిగా అలియా..!
కాని తను శంకర్ సినిమా గేమ్ ఛేంజర్ చేశాడు. అలానే బుచ్చిబాబు మూవీకి సైన్ చేశాడు. దీంతో చరణ్‌కి వినిపించిన కథే రౌడీ స్టార్ విజయ్‌కి వినిపించి ఓకే చేయించుకున్నాడట కన్నడ డైరక్టర్ నర్తన్. రూ.200 కోట్ల బడ్జెట్‌తో లైకా సంస్థ ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. అంతేకాకుండా.. చరణ్‌తో జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి ప్లాన్ చేసిన సినిమా కూడా ఇలానే విజయ్ దేవరకొండ ఎకౌంట్లోనే పడింది. రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథని రౌడీ స్టార్ ఓకే చేశాడట.
గతంలో పవన్ రిజెక్ట్ చేసిన ఎన్నో సినిమాల్లో ఇడియట్, అమ్మానాన్న తమిళమ్మాయి, నువ్వునాకు నచ్చావ్, అతడు, పోకిరి.. ఇలా చాలానే ఉన్నాయి. అవి రవితేజ, మహేశ్, వెంకటేష్‌కి బ్లాక్ బస్టర్లుగా మారాయి. అందుకే చెర్రీ రిజెక్ట్ చేసిన రెండు కథల్లో విజయ్ హీరో అనగానే, తన పంట పండిందంటున్నారు.