Rashmika-Vijay: నేషనల్ క్రష్‌కి రౌడీ బాయ్‌ గ్రాండ్ పార్టీ.. దుబాయ్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్‌ షురూ..!

రష్మిక, విజయ్ కలిసి పార్టీలు చేసుకుంటారు, ట్రిప్పులకు వెళ్తారు, పండగలకు రష్మిక విజయ్ ఇంటికి వస్తుందని అందరికి తెలిసిందే.. కాగా.. రష్మిక మందన్న ప్రస్తుతం అబుదాబిలో ఉంది. ఇందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 4, 2024 | 11:57 AMLast Updated on: Apr 04, 2024 | 11:57 AM

Vijay Devarakonda Giving Party On Rashmika Mandannas Birthday

Rashmika-Vijay: ఏ ముహూర్తాన రష్మిక-విజయ్‌ దేవర కొండ కలిసి గీతా గోవిందం సినిమా చేశారో కానీ.. అప్పటి నుంచి వీళ్లిద్దరి గురించి రూమర్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే.. వీటిపై ఈ జంట ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. తమపై వస్తున్న రూమర్లను అవునన లేదు.. కాదనీ కొట్టిపారేయలేదు. తమ పని తాము చేసుకుంటూ పోతూ.. మధ్య మధ్యలో తమ మధ్య లవ్ లీకయ్యేలా పోస్ట్‌లు పెడుతూ సస్పెన్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా మరోసారి అదే జరిగింది.

PAWAN KALYAN: థియేటర్ల దగ్గర ఉన్న ఉద్యోగులు పింఛన్లు ఇవ్వడానికి లేరా.. ప్రభుత్వానికి పవన్ ప్రశ్న

రష్మిక మందన్న తన పుట్టినరోజును జరుపుకోనుంది. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ కూడా విడుదలవుతోంది. అయితే.. ఇప్పుడు రష్మిక పుట్టినరోజు గురించిన ఓ కొత్త విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య ఏదో ఉందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరి మధ్య ఏం ఉన్నా లేకపోయినా వీళ్ళు బాగా క్లోజ్ అని మాత్రం అందరికి తెలుసు. రష్మిక, విజయ్ కలిసి పార్టీలు చేసుకుంటారు, ట్రిప్పులకు వెళ్తారు, పండగలకు రష్మిక విజయ్ ఇంటికి వస్తుందని అందరికి తెలిసిందే. కాగా.. రష్మిక మందన్న ప్రస్తుతం అబుదాబిలో ఉంది. ఇందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోకు ‘నా పుట్టినరోజు వారం’ అని క్యాప్షన్ ఇచ్చింది. అలానే ఒక నెమలి ఫొటోను షేర్ చేస్తూ బ్యూటిఫుల్ అంటూ రష్మిక స్టోరీ పెట్టింది. ఇక.. విజయ్ దేవరకొండ కూడా ఇక్కడికి వెళ్లబోతున్నాడని టాలీవుడ్‌ గుసగుసలాడుతోంది. ఇక ఇది జరిగిన కాసేపటికే విజయ్ దేవరకొండ కూడా ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఇందులో ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అయితే బ్యాక్ గ్రౌండ్‌లో గమనిస్తే అదే నెమలి మళ్లీ దర్శనమిచ్చింది.

ఇంకేముంది ఈ రెండు స్టోరీలను క్లబ్ చేసి వీళ్లిద్దరూ సేమ్ ప్లే‌స్‌లో ఉన్నారంటూ కామన్‌ ఫ్యాన్స్ సందడి మొదలు పెట్టేశారు. రష్మిక బర్త్‌డే కావడంతో రౌడీ బాయ్‌ దుబాయ్‌లో గ్రాండ్‌గా పార్టీ సెలబ్రేట్ చేస్తున్నాడంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఎందుకు మాతో ఇలా దోబూచు లాడతారు. మీ లవ్ ఓపెన్ చేసెయ్యొచ్చు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి రష్మిక బర్త్ డే సెలబ్రేషన్స్ నుంచి వీళ్లిద్దరు కలిసి ఉన్న ఫోటో ఒక్కటైనా లీక్ అవ్వదా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.