Vijay Devarakonda: రష్మిక-విజయ్ లవ్.. మై లవ్ వీడీ.. కొంపముంచిన ఫోన్..
రష్మిక మందన్న ఫోన్‌లో విజయ్ దేవరకొండకి కాల్ చేస్తుంటే, వెనక అద్దంలో ఆ నెంబర్ ఎలా సేవ్ చేసుకుందో లీకైంది. మై లవ్ వీడీ అని తన నెంబర్‌ని సేవ్ చేసుకున్నట్టు తేలింది. దీంతో వీళ్ల ప్రేమ వ్యవహరం నిజమే అనుకోవాల్సి వస్తోంది.

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఉంది ప్రేమే అనేలా ఆమధ్య రెస్టారెంట్లలో సందడి చేస్తూ ముంబై మీడియా కంట్లో పడ్డారు ఇద్దరూ. తర్వాత మాల్దీవుల్లో కళ్ళద్దాలు ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నారు. ఇలా తరుచూ ఏదో ఒక అంశంతో ఈ ఇద్దరి మధ్య ఉంది ఎఫైర్ కాదు, ప్యూర్ లవ్ అని తెలిసేలా జర్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని, మూడు ముళ్ల గురించి వస్తున్న గుసగుసల్లో నిజం ఉందని తేలింది.
Taapsee Pannu: ప్రియుడితో పెళ్లికి సిద్ధమైన తాప్సీ.. పెళ్లెప్పుడంటే..!
యానిమల్ మూవీ ప్రమోషన్ టైంలో ఆమధ్య బాలయ్య షోలో తన ఫోన్ నుంచి విజయ్‌కి కాల్ చేసింది రష్మిక. అప్పుడు విజయ్ దేవరకొండ పేరుని ఎలా సేవ్ చేసుకుందో చూపించలేదు. రణ్‌బీర్ కపూర్ మాత్రం ఫోన్ కాల్ చూసి కన్పామ్ చేశాడు. రీసెంట్‌గా రష్మిక ఓ నెటిజన్ ప్రశ్నకి తనకు కాబోయే భర్త ఎలా ఉండాలంటే వెరీ డేరింగ్ అనేసింది. వెరీ డేరింగ్ షార్ట్ ఫాం వీడీ. బేసిగ్గా ఇంగ్లిష్‌లో వీడీ అంటే విజయ్ దేవరకొండ. సో.. ఇలా ఇండైరెక్ట్‌గా చెప్పిందిలే అనుకుంటే, బాలీవుడ్ ఇంటర్వూలో మాత్రం తన ఫోన్‌లో విజయ్ దేవరకొండ పేరుని ఎలా సేవ్ చేసుకుందో మిస్టేక్‌లో తెలిసేలా చేసింది. రష్మిక మందన్న ఫోన్‌లో విజయ్ దేవరకొండకి కాల్ చేస్తుంటే, వెనక అద్దంలో ఆ నెంబర్ ఎలా సేవ్ చేసుకుందో లీకైంది.
మై లవ్ వీడీ అని తన నెంబర్‌ని సేవ్ చేసుకున్నట్టు తేలింది. దీంతో వీళ్ల ప్రేమ వ్యవహరం నిజమే అనుకోవాల్సి వస్తోంది. ఇక పెళ్లి కూడా ఈ ఏడాదే ప్లాన్ చేసుకుంటున్నారనే వార్తల్లో కూడా నిజమే కనిపిస్తోంది. దసరాకి ముందు ఈ ఇద్దరు ఒకటవుతున్నారట. అందుకుతగ్గ ప్లానింగ్‌తోనే ఈ ఇద్దరూ ఉన్నారని, పుష్ప 2 రిలీజ్ తర్వాత బిగ్ ఎనౌన్స్‌మెంట్ అని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఫోన్ వల్ల తేలిపోయింది.