Vijay Devarakonda: 100 కోట్ల కటౌట్.. 30 కోట్ల నుంచి 10 కోట్లకు పడిపోయాడు..
హిట్లు ప్లాపులకు అతీతంగా ఇమేజ్ సొంతం చేసుకోవటం, రజినీకాంత్, పవన్ కళ్యాణ్ కే చెల్లింది. ఆతర్వాత స్థానం విజయ్ దేవరకొండదే అంటున్నారు. అలాంటి పిచ్చి క్రేజ్ పాన్ ఇండియా లెవల్లో యూత్ లో తనకుంది.

Vijay Devarakonda moive updates
కావాల్సిందల్లా కేవలం ఓ సాలిడ్ సక్సెస్.. అదే లేక డీలా పడ్డాడు.. ఎంతగా అంటే లైగర్ హిట్టైతే వందకోట్ల స్టార్ గా మారాల్సిన తను, అందులో పదో వంతుకి అంటే పదికోట్ల రెమ్యునరేషన్ తీసుకునే వరకు పరిస్థితులు దిగజారాయి. దిల్ రాజు బ్యానర్ లో పరశురామ్ తీస్తున్న మూవీ కి విజయ్ తీసుకునే రెమ్యునరేషన్ పదికోట్లని తెలుస్తోంది.
నిజానికి లైగర్ కి 25 కోట్లు తీసుకోవాల్సిన విజయ్, 3 కోట్లు మాత్రమే తీసుకుని, సినిమా హిట్టయ్యాక మిగతాది తీసుకోవాలనుకున్నాడు. అలా లైగర్ ఫ్లాప్ తో 22 కోట్లు నష్టపోయాడు. సరే 30 కోట్ల రెమ్యునరేషన్ తో డిమాండ్ ఉన్న హీరో కదా, అలా అన్నా వెలుతున్నాడా అంటే, గౌతమ్ తిన్ననూరి మూవీ నుంచి పరశురామ్ సినిమా వరకు తను, ఒక్కో ప్రాజెక్ట్ కి 10 కోట్లే తీసుకుంటున్నాడట. అంతగా తన పారితోషికం గ్రాఫ్ పడిపోయింది.