VIJAY DEVARAKONDA: కొత్త వాళ్లు వద్దు.. పాత వాళ్లే ముద్దంటున్న రౌడీ స్టార్..
టాక్సీవాలాతో విజయ్‌కి హిట్ పడిన వెంటనే, రాహుల్ సంకృత్యన్.. నానితో శ్యామ్ సింగరాయ్ సినిమా తీశాడు. అది బ్లాక్ బస్టర్ అవటంతో న్యాచురల్ స్టార్ ఎకౌంట్‌లో మొదటి వందకోట్ల సినిమా వచ్చినట్టైంది. ఇప్పడు రౌడీ స్టార్ వంతొచ్చింది.

VIJAY DEVARAKONDA: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీతో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఆ తర్వాత కూడా పాత టాక్సీలోనే ఎక్కేస్తా అంటున్నాడు. తనకి టాక్సీవాలాతో హిట్ ఇచ్చిన రాహుల్ సంకృత్యన్‌తో సినిమాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిజంగానే ఈ కాంబినేషన్ ఫైనలైంది. టాక్సీవాలాతో విజయ్‌కి హిట్ పడిన వెంటనే, రాహుల్ సంకృత్యన్.. నానితో శ్యామ్ సింగరాయ్ సినిమా తీశాడు.
HARISH SHANKAR: చిరు, బాలయ్య నుంచి ఆఫర్.. ముందు నుయ్యి వెనక గొయ్యిలా హరీష్ శంకర్ పరిస్థితి..?
అది బ్లాక్ బస్టర్ అవటంతో న్యాచురల్ స్టార్ ఎకౌంట్‌లో మొదటి వందకోట్ల సినిమా వచ్చినట్టైంది. ఇప్పడు రౌడీ స్టార్ వంతొచ్చింది. రెండేళ్లుగా రాహుల్ రెడీ చేసిన కథకి, ఇప్పుడు రౌడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అర్జున్ రెడ్డి, గీత గోవిందం హిట్స్‌తో విజయ్‌కి పెరిగిన క్రేజ్‌ని లైగర్‌తో క్యాష్ చేసుకోబోయాడు పూరీ. కాని దారితప్పిన కథ వల్ల డిజాస్టరే ఎదురైంది. దీంతో విజయ్ కెరీరే తలకిందులైంది. అందుకే మాస్ జోనర్లు, కొత్త కాంబినేషన్లు వద్దు.. పాత కాంబినేషనే ముద్దంటున్నాడు. అందుకే గీత గోవిందంతో హిట్ ఇచ్చిన పరశురామ్‌తో ఫ్యామిలీ స్టార్ చేస్తూనే, టాక్సీవాలా డైరెక్టర్‌తో ముందడుగు వేశాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ త్వరలోనే రానుంది.