Vijay Devarakonda: ముగ్గురు దర్శకులతో సినిమాలు మొదలెట్టనున్న రౌడీ హీరో..
ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్‌గా రాబోతోంది. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి మేకింగ్‌లో పోలీస్‌గా మారి.. విజయ్ దేవరకొండ లాఠీ తిప్పబోతున్నాడని తెలుస్తోంది. కాని ఆతర్వాతే తన నిర్ణయాలు విచిత్రంగా ఉన్నాయి.

Vijay Devarakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ స్పీడ్ ఆమధ్య ఓరేంజ్‌లో ఉంటే, ఇప్పుడు తగ్గింది. కారణం లైగర్ ఫ్లాప్ కావడంతోపాటు ఖుషీ కూడా అనుకున్నంతగా ఆడకపోవడమే. ఆ తర్వాతే ఆలోచనల్లో పడ్డ విజయ్ మొత్తానికి వేగం పెంచాడు. ఒకేసారి 3 సినిమాలు చేయబోతున్నాడు. ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్‌గా రాబోతోంది. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి మేకింగ్‌లో పోలీస్‌గా మారి.. విజయ్ దేవరకొండ లాఠీ తిప్పబోతున్నాడని తెలుస్తోంది.
GAAMI: పాన్ ఇండియా లెవల్‌లో ఆసక్తి రేపుతున్న గామి.. ఆ సినిమాల బాటలోనే..
కాని ఆతర్వాతే తన నిర్ణయాలు విచిత్రంగా ఉన్నాయి. ఇంతవరకు విజయ్ దేవరకొండ ట్రై చేయని కామెడీ జోనర్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోందట. అశోకవనంలో అర్జున కళ్యాణం ఫేం విద్యాసాగర్ చింత డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడు. ఇది కంప్లీట్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న సినిమా అని తెలుస్తోంది. పెళ్లి చూపులు మూవీలో విజయ్ ఎంత కామెడీ చేసినా అది యూత్‌ఫుల్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా. అయితే, ఇప్పుడు చేయబోయేదే పూర్తిస్థాయి కామెడీ డ్రామా అంటున్నారు.
ఇదేకాదు విజయ్ దేవరకొండ మరో దర్శకుడు రవికిరణ్ కోలాకి కూడా ఛాన్స్ ఇచ్చాడు. రాజావారు రాణివారు తీసిన ఈ దర్శకుడు రౌడీ స్టార్‌తో హర్రర్ మూవీ ప్లాన్ చేశాడట. టాక్సీవాలా కాస్త హర్రర్‌లా కనిపించినా, అది పూర్తి స్థాయి హర్రర్ మూవీ కాదు. కాబట్టి, పోలీస్ మూవీతో పాటు హర్రర్ మూవీ, కామెడీ సినిమాలకు సైన్ చేసి ఒకే సారి మూడు మూవీలతో బిజీ కానున్నాడు విజయ్ దేవరకొండ.