VIJAY DEVARAKONDA: ఇన్ని దెబ్బలు తగిలినా.. ఆ క్రేజ్ ఏంటి గురూ..?
రౌడీ స్టార్ అప్పడే ఆ స్థాయిని అందుకున్నాడనలేం కాని, ప్రజెంట్ తన ఫెయిల్యూర్స్ చూస్తుంటే అనక తప్పట్లేదు. అర్జున్ రెడ్డి, గీత గోవిందంతో తనకి భాషలకు అతీతంగా దేశ వ్యాప్తంగా వచ్చిన క్రేజ్, ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు.

VIJAY DEVARAKONDA: రౌడీ స్టార్‌ని పవర్ స్టార్‌తో పోలిస్తే పవన్ ఫ్యాన్స్‌కి కోపం రావొచ్చు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పోలిస్తే తన అభిమానులు సీరియస్ అవ్వొచ్చు. కానీ, వాళ్లంత అనుభవం, వయసు లేకున్నా, వాళ్లతో రౌడీ స్టార్ విజయ్‌ని పోల్చటానికి రీజన్ తన ఇమేజే. బేసిగ్గా హిట్ మీద హిట్ కొడితే స్టార్ కెపాసిటీ తెలియదు. చాలా ఫెయిల్యూర్స్ తర్వాత కూడా అదే రేంజ్ మార్కెట్ ఉంటే అది స్టార్‌డమ్ అంటారు.
KALKI 2898 AD: కల్కి అమితాబ్ యంగ్ లుక్‌పై రచ్చ.. కొరటాల తప్పే నాగి చేస్తున్నాడా ?
పవన్ కూడా కెరీర్ బిగినింగ్‌లో వరుస హిట్లుతో ట్రెండ్ సెట్ చేశాడు. తర్వాత పావుడజన్, అరడజన్ ఫ్లాపులు పడ్డాయి. కాని తన ఇమేజ్ తగ్గలేదు. ఖుషీ ఆతర్వాత మళ్లీ గబ్బర్ సింగ్ వచ్చే వరకు హిట్లు తగ్గినా, ఇమేజ్ తగ్గలేదు. మార్కెట్ పెరగకుడా ఉండలేదు. అదంతే.. స్టార్‌డమ్ వస్తే, ఫ్లాపులు పడ్డా మార్కెట్ తగ్గదు. మహేశ్ బాబు, పవన్, ప్రభాస్ కూడా హిట్, ఫెయిల్యూర్స్‌కి అతీతులయ్యారు. రౌడీ స్టార్ అప్పడే ఆ స్థాయిని అందుకున్నాడనలేం కాని, ప్రజెంట్ తన ఫెయిల్యూర్స్ చూస్తుంటే అనక తప్పట్లేదు. అర్జున్ రెడ్డి, గీత గోవిందంతో తనకి భాషలకు అతీతంగా దేశ వ్యాప్తంగా వచ్చిన క్రేజ్, ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. లైగర్ ప్లాపైనా, ఖుషీ ఫెయిల్యూర్ అని తెలిసినా, ఫ్యామిలీ స్టార్‌కి మాత్రం మతిపోగొట్టే రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఫ్యామిలీ స్టార్ ఓపెనింగ్స్ అదిరిపోయినా, తర్వాత ఫ్లాప్ టాక్ రావటంతో సీన్ రివర్స్ అయ్యింది. అయినా వరుస ఫ్లాపులు పడితే హీరోని జనం మర్చిపోతారు.
కాని ఫెయిల్యూర్స్ ఎన్ని వచ్చినా విజయ్ కొత్త సినిమా వస్తోందంటే, ఆ హైప్ ఓరేంజ్‌లో ఉంటుంది. ఓపెనింగ్స్ లెక్క అదిరి పోతోంది. అందుకే పవన్, మహేశ్, ప్రబాస్ లాంటి స్టార్స్‌లాగా.. హిట్, ఫెయిల్యూర్స్‌కి అతీతమైన ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ రౌడీకి వచ్చినట్టే అని తెలుస్తోంది. ఒక వైపు విజయ్‌ని అపజయాలు తరుముతున్నా, తన క్రేజ్‌కు సంబంధించిన ఉరుములు, మెరుపులు ఇలా బయటపడటం, మాత్రం తనకి పెద్ద ఊరటనిచ్చే అంశం.