VIJAY DEVARAKONDA: పూరీ, శివ నిర్వాణ, పరశురామ్.. ముగ్గురూ హ్యాండిచ్చారా..?
అంతా యాటిట్యూడ్ అంటున్నారనే చాలా తగ్గాడు. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్‌లో చాలా సెటిల్డ్‌గా ఉన్నాడు. అయినా ఫ్యామిలీ స్టార్ మీద ట్రోలింగ్ ఆగలేదు. ఈసారి యాంటీ ఫ్యాన్స్ పని కాకుండా, ఓవరాల్‌గా ఫ్యామిలీ స్టార్‌కి నెగెటివ్ కామెంట్స్ పెరిగాయి.

VIJAY DEVARAKONDA: విజయ్ దేవరకొండ, బయటికి యాటిట్యూడ్‌తో కనిపిస్తాడు. కాస్త అతిగా తనని తాను ఎక్కువ ఊహించుకుంటాడు. కాని నిజానికి యూత్‌కి కనెక్ట్ అయ్యేందుకు విజయ్ ఎంచుకుందే తన యాటిట్యూడ్. అలాంటి అప్రోచే తనకి స్టార్‌డమ్ తెచ్చిందని నమ్ముతాడు కాబట్టే, అలా ఆడియో ఫంక్షన్స్‌లో రియాక్ట్ అవుతాడనే అభిప్రాయముంది. సరే అంతా యాటిట్యూడ్ అంటున్నారనే చాలా తగ్గాడు. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్‌లో చాలా సెటిల్డ్‌గా ఉన్నాడు. అయినా ఫ్యామిలీ స్టార్ మీద ట్రోలింగ్ ఆగలేదు.
Shashank Singh: పొరపాటున కొంటే అతనే దిక్కయ్యాడు.. మారుమోగుతున్న శశాంక్ సింగ్ పేరు
ఈసారి యాంటీ ఫ్యాన్స్ పని కాకుండా, ఓవరాల్‌గా ఫ్యామిలీ స్టార్‌కి నెగెటివ్ కామెంట్స్ పెరిగాయి. కారణం కథలో క్వాలిటీ, కథనంలో ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవటమే. ఇది విజయ్ పాపం కాదు. డైరెక్టర్లు రౌడీ స్టార్‌కి ఇస్తున్న శాపం. నిజానికి విజయ్ దేవరకొండ మంచి నటుడు. తన యాక్టింగ్ స్కిల్స్‌కి వంకపెట్టలేం. అలాంటి నటుడి సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయంటే దానికి కారణం దర్శకుల స్వార్ధమే అనాల్సి వస్తోంది. కథ లేకుండా లైగర్ లాంటి సినిమా తీసి పాన్ ఇండియా లెవల్లో రౌడీ స్టార్‌ని మోసం చేశాడు పూరీ. ఈ సినిమా కోసం రెండేళ్లు విజయ్ కష్టపడ్డాడు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. కాని కథలేని మూవీ అవటంతో ఎవరికీ చెప్పుకోలేని వ్యధగా రిజల్ట్ షాక్ ఇచ్చింది. తర్వాత వచ్చిన ఖుషీ కూడా ఓ దిక్కుమాలిన కథకి, అదేదో కళా ఖండం అన్నంత కట్టింగ్ ఇచ్చాడు శివనిర్వాణ. ఏదో చెన్నైలో వసూళ్లొచ్చాయి.
ఇంకెక్కడో కాంప్లిమెంట్స్ దక్కాయని కవర్ చేసుకోవటం తప్ప ఖుషీ వల్ల విజయ్ దేవరకొండని శివ నిర్వాణ ముంచాడనక తప్పని పరిస్థితి. ఇక ఇప్పుడు ఫ్యామిలి స్టార్ వంతు. అసలే సర్కారు వారి పాటలో తలా తోకలేని పాయింట్‌కి సీన్లు అల్లి, డైలాగ్స్ రాసి చుట్టేశాడు పరశురామ్ అన్నారు. ఇప్పుడు మెగాస్టార్ గ్యాంగ్ లీడర్ మూవీ కథని సరికొత్తగా తీయబోయి, ప్లాస్టిక్ సర్జరీ తర్వాత ముఖాన్ని గుర్తుపట్లేకపోవటంలా, ఫ్యామిలీ స్టార్ వచ్చాక అసలు గ్యాంగ్ లీడర్ కి దీనికి లింకెక్కడ అనుకునే పరిస్తితి వచ్చింది. ఓవరాల్ గా పూరీ, శివనిర్వాణ, పరశురామ్ ముగ్గురు విజయ్ ని మునక చెట్టెక్కించి మెత్తగా మోసం చేశారని అర్ధమౌతోంది. జనాలు రౌడీని చూసి జాలిపడే పరిస్థితొచ్చింది.