FAMILY STAR: అనుకున్నట్టే అవుతుందా.. ‘ఫ్యామిలీ స్టార్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంత తక్కువా..?
దేవరకొండ కెరీర్‌లోనే వరల్డ్ వైడ్‌గా అత్యధిక థియేటర్స్‌లో లాండింగ్ జరిగింది. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫ్యామిలీ స్టార్ వరల్డ్ వైడ్‌గా తొలి రోజు రూ.5.7 కోట్ల గ్రాస్‌ని సాధించింది. ఈ ఫిగర్ దేవరకొండ రేంజ్ కానే కాదు.

FAMILY STAR: విజయ్ దేవరకొండ అభిమానులు, సినీ అభిమానుల ఆశ ఎట్టకేలకు ఫలించింది. వాళ్లంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఫ్యామిలీ స్టార్ విడుదల అయ్యింది. దేవరకొండ కెరీర్‌లోనే వరల్డ్ వైడ్‌గా అత్యధిక థియేటర్స్‌లో లాండింగ్ జరిగింది. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫ్యామిలీ స్టార్ వరల్డ్ వైడ్‌గా తొలి రోజు రూ.5.7 కోట్ల గ్రాస్‌ని సాధించింది.
NTR war : హృతిక్ తో ఎన్టీఆర్ వార్..
ఈ ఫిగర్ దేవరకొండ రేంజ్ కానే కాదు. పైగా మృణాల్ ఠాకూర్, పరశురామ్, దిల్ రాజు వంటి దిగ్గజాలు ఉండి కూడా అంత తక్కవ కలెక్షన్స్ రావడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. విజయ్ ఫ్యాన్స్ అండ్ సినీ ట్రేడ్ వర్గాలు కూడా కలెక్షన్స్‌పై విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మరి వీకెండ్స్‌లో కలెక్షన్స్ పెరుగుతాయేమో చూడాలి. మూవీకి అయితే మిక్స్‌డ్ టాక్ వస్తుంది. సినిమా స్లోగా ఉందని కొందరు అంటుంటే.. ఇలాంటి కథతో గతంలో చాలా సినిమాలు వచ్చాయని మరికొంతమంది అంటున్నారు.
అలాగే దేవరకొండ, మృణాల్‌ల మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదని, అసలు దేవరకొండ లాంటి వెరైటీ హీరోతో రొటీన్ సినిమా తియ్యకూడదని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి విజయ్ దేవరకొండకు ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందిస్తుందో చూడాలి.