FAMILY STAR: ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. రెండ్రోజుల్లోనే ఓటీటీలోకి

సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ వచ్చింది. ఫ్యామిలీకి నచ్చే అంశాలు, సింపుల్ లవ్ స్టోరీ ఉన్నప్పటికీ.. కథ, కథనాలు ఆడియెన్స్‌కు నచ్చలేదు. దీంతో సినిమా థియేటర్ల దగ్గర సందడి చేయలేదు. అయితే, ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 24, 2024 | 05:39 PMLast Updated on: Apr 24, 2024 | 5:39 PM

Vijay Devarakondas Family Star Movie Coming To Ott In Prime Video

FAMILY STAR: విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ నెల 5న విడుదలైంది. మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా చేసింది. గీతగోవిందం తర్వాత విజయ్, పరశురామ్ కాంబోలో వచ్చిన మూవీ కాబట్టి అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఆ అంచనాలను అందుకోవడంలో ఈ చిత్రం విఫలమైంది.

SSMB 29: రాజమౌళి-మహేశ్ సినిమా ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే అనౌన్స్‌మెంట్

సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ వచ్చింది. ఫ్యామిలీకి నచ్చే అంశాలు, సింపుల్ లవ్ స్టోరీ ఉన్నప్పటికీ.. కథ, కథనాలు ఆడియెన్స్‌కు నచ్చలేదు. దీంతో సినిమా థియేటర్ల దగ్గర సందడి చేయలేదు. అయితే, ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 26న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో అధికారికంగా వెల్లడించింది. తెలుగుతోపాటు తమిళ్‌లో కూడా స్ట్రీమింగ్ కానుంది. విడుదలైన మూడు వారాల్లోనే ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు వస్తుండటం విశేషం. నిజానికి ఇంకొన్ని రోజుల తర్వాత స్ట్రీమింగ్‌ అవ్వాలి. కానీ, సినిమా డిజాస్టర్ కావడంతో ముందుగానే ఓటీటీలోకి తీసుకొస్తోంది చిత్ర బృందం.

చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండకు ఈ చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఆయనకు నష్టాలే అందించింది. థియేటర్లలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోకపోయిన ఈ చిత్రం ఓటీటీలో ఎంతమేరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి. ఇక.. ఈ వారమే తెలుగులో టిల్లూ స్క్వేర్, భీమా వంటి సినిమాలు కూడా ఓటీటీలోకి రాబోతున్నాయి.