VIJAY DEVARAKONDA: ఫ్యామిలీ స్టార్‌గా రేంజ్ ఎంతో తేలిపోతోందా..?
పెళ్లి చూపులు కోటిన్నర పెడితే 30 కోట్లొచ్చాయి. అర్జున్ రెడ్డి 5 కోట్ల పెట్టుబడిని 55 కోట్ల రాబడిగా మారిస్తే, గీతా గోవిందం తో రూ132 కోట్ల వసూళ్ళొచ్చాయి. ఇవన్ని చూస్తే విజయ్ దేవరకొండని ఈజీగా వందకోట్ల స్టార్ అనొచ్చు.
VIJAY DEVARAKONDA: ఫ్యామిలీ స్టార్ మూవీ థియేట్రికల్ రైట్స్ 50 కోట్లు చెబుతున్నాడట దిల్ రాజు. ఇక శాటిలైట్, రైట్స్, డిజిటల్ రైట్స్ ఓవర్‌సీస్ రైట్స్ కలుపుకుంటే రూ.120 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఇదేం పెద్ద ఎమౌంట్ కాదు. ఎందుకంటే తన ఫ్లాప్ మూవీ లైగరే రూ.180 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. కాని అది ప్లాపయ్యాకే తన తలరాత తలకిందులైంది. పెళ్లి చూపులు కోటిన్నర పెడితే 30 కోట్లొచ్చాయి. అర్జున్ రెడ్డి 5 కోట్ల పెట్టుబడిని 55 కోట్ల రాబడిగా మారిస్తే, గీతా గోవిందం తో రూ132 కోట్ల వసూళ్ళొచ్చాయి.
MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ సారథ్యంలో సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్.. పండగే..పండగ..
ఇవన్ని చూస్తే విజయ్ దేవరకొండని ఈజీగా వందకోట్ల స్టార్ అనొచ్చు. అంతేకాదు అర్జున్ రెడ్డిని అన్ని భాషల్లో చూడటంతో వచ్చిన గుర్తింపు పరంగా చూస్తే, చరణ్, ఎన్టీఆర్, బన్నీ కంటే ముందే విజయ్ దేవరకొండ ప్రభాస్ తర్వాతి స్తానంలో ఉన్నాడు. ఎటొచ్చి తనకి పాన్ ఇండియా గుర్తింపు ఉన్నా, హిట్ లేదు. లైగర్ ప్లాప్ తర్వాత ఖుషీ కూడా సోసోగా ఆడటంతో, అసలు తన ఫ్యూచరే డైలామాలో పడింది. అందుకే ఫ్యామిలీ స్టార్‌తో కనీసం ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైతే, పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ సక్సెస్ అయితే, వందలకోట్లు రాకున్నా, పాన్ ఇండియా లెవల్లో ఉన్న క్రేజ్, మార్కెట్ మైలేజ్‌ని కాపాడుకున్నట్టవుతుంది. కాని విజయ్ అంటే యూత్‌కి, మాస్‌కి భయంకరంగా ఇష్టం.
అది మార్కెట్‌గా స్థిరపడాలంటే, అర్జున్ రెడ్డి అంతకాకున్నా అందులో సగం రేంజ్‌లో అయినా ఓ సాలిడ్ పాన్ ఇండియా హిట్ పడాలి. అలాంటిది తను సడన్‌గా ఫ్యామిలీ స్టార్ అని సేఫ్ గేమ్ ఆడటం చూస్తుంటే, రిస్క్ తక్కువే కాబట్టి నో ప్రాబ్లమ్. కాని, మరో ప్రభాస్, మరో చరణ్ అనిపించుకునే అవకాశాన్ని హోల్డ్‌లో పెట్టినట్టువుతుంది. ప్రజెంట్ తన స్టోరీ సెలక్షన్ చూస్తే పాన్ ఇండియా క్రేజ్ కోసం ట్రై చేస్తున్నట్టు ఏమాత్రం అనిపించదు.